ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 10) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న లాభాల్లో ప్రారంభమై, చివరకు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి బలహీన సంకేతాలు కనిపించినప్పటికీ దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా ఉన్నాయి. సెన్సెక్స్ దాదాపు వంద పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభాల్లో ఉంది. ఐటీ, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ సూచీలు సూచీలను లాభాల్లోకి తీసుకెళ్లాయి. నిఫ్టీ కీలక 15700 పాయింట్ల పైకి చేరుకుంది. అదానీ పవర్, బాటా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఉన్నాయి.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,143.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,198.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,957.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.45 సమయానికి +191.78 (0.37%) పాయింట్లు ఎగిసి 52,133.42 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 15,692.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,721.05 గరిష్టాన్ని, 15,648.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం సమయానికి 64.20 (0.41%) పాయింట్లు నష్టపోయి 15,699.55 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 3.52 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.56 శాతం, JSW స్టీల్ 2.06 శాతం, విప్రో 1.84 శాతం, టెక్ మహీంద్రా 1.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 1.29 శాతం, బజాజ్ ఆటో 1.05 శాతం, యూపీఎల్ 0.67 శాతం, ఐచర్ మోటార్స్ 0.55 శాతం, అదానీ పోర్ట్స్ 0.53 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.43 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.11 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.24 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.31 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 0.84 శాతం, నిఫ్టీ మీడియా 1.34 శాతం, నిఫ్టీ మెటల్ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 1.57 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 1.48 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.39 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.20 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.02 శాతం నష్టపోయింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications