వరుసగా రెండురోజుల పాటు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు (మార్చి 26, శుక్రవారం) కోలుకున్నాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు కళ్యాణ్ జ్యువెల్లర్స్, సురోడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. మార్కెట్ పైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ మళ్లీ ఉంటుందేమోననే ఆందోళనలు గత రెండు రోజులుగా మార్కెట్ భారీ నష్టాలకు కారణంగా మారాయి. సెన్సెక్స్ రెండు రోజుల్లో 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే లాక్ డౌన్ ఉండే అవకాశాలు లేవని ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

భారీ లాభాల్లో మార్కెట్
సెన్సెక్స్ నేడు ఉదయం 48,969.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,170.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,699.91 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,506.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,554.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,414.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.12.20 సమయానికి సెన్సెక్స్ 664.73 (1.37%) పాయింట్లు లాభపడి 49,104.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 193.65 (1.35%) పాయింట్లు ఎగిసి 14,516.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. గత రెండు రోజుల్లో 1600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నేడు మధ్యాహ్నం వరకు 600 పాయింట్లకు పైగా లాభపడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్, SBI, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.40 శాతం, టాటా మోటార్స్ 4.22 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.97 శాతం, ఏషియన్ పేయింట్స్ 3.90 శాతం, హిండాల్కో లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.73 శాతం, ONGC 0.29 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.06 శాతం ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.33 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.17 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.45 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.56 శాతం, నిఫ్టీ ఐటీ 0.90 శాతం, నిఫ్టీ మీడియా 0.70 శాతం, నిఫ్టీ మెటల్ 3.06 శాతం, నిఫ్టీ ఫారమా 0.39 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.53 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.10 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications