ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు ఆర్బీఐ రూ.50,000 కోట్ల ఉద్దీపనలు ప్రకటించడంతో నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు కూడా అదే ఒరవడి కొనసాగించాయి. తొలుత కాసేపు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత మెల్లిగా లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 294.09 పాయింట్లు లేదా 0.93% లాభపడి 32,037.17 వద్ద, నిఫ్టీ 86.30 పాయింట్లు లేదా 0.93% లాభపడి 9,368.60 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభంలో 585 షేర్లు లాభాల్లో, 137 షేర్లు నష్టాల్లో ఉండగా, 39 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
అమెరికా డాలర్ మారకంతో రూపాయి 76.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. సోమవారం రోజు 76.24 వద్ద క్లోజ్ అయింది. 7 పైసలు నష్టపోయింది. ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి.

అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో క్రమంగా ఆంక్షలు ఎత్తివేయడం, ఆర్థిక పునరుద్ధరణకు అగ్రరాజ్యం చర్యలు, మన దేశంలో కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్బీఐ, కేంద్రం చర్యలు వంటివి మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. చమురు ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications