ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 86.17 పాయింట్లు లేదా 0.27% నష్టపోయి 31,367.34 వద్ద, నిఫ్టీ 22.30 పాయింట్లు లేదా 0.24% నష్టపోయి 9,183.30 వద్ద ప్రారంభమైంది. 441 షేర్లు లాభాల్లో, 231 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 40 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత కాసేపటికో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.10.27 సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు లాభపడింది.
చమురు రంగం మినహా మిగతా రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, బీపీసీఎల్, ఐవోసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ ఉన్నాయి.

మరింత దిద్దుబాటు మిగిలి ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తయారీ రంగం దారుణంగా పడిపోయిందని, ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెల కూడా మరింత బలహీనంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నందున జూన్ త్రైమాసికం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలహీనమేనని, లాక్ డౌన్ కారణంగా దేశీయంగా కూడా జూన్ క్వార్టర్ పైన భారీ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
నిన్న మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిశాయి. మొన్న భారీ పతనం తర్వాత నిన్న కోలుకుంటుందని ఇన్వెస్టర్లు భావించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు చివరలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రభావం చూపింది. లాక్ డౌన్ పొడిగింపు, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చుననే అంశం, అంతర్జాతీయ పరిమామాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. మంగళవారం డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు బలపడి 75.63 వద్ద క్లోజైంది. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్ లాభాల్లో ముగిసింది.మిగతా ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. నిన్న సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications