స్టాక్ మార్కెట్లు నేడు(మంగళవారం, 21, 2022) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిన్న 51,597 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 300 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే 52,000 పాయింట్లు క్రాస్ చేసింది. నిఫ్టీ కీలకమైన 15,500 పాయింట్లను దాటింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీనికి తోడు ఆర్బీఐ, ఫెడ్ వడ్డీ రేటు పెంపు అనంతరం మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడంతో కనిష్టాల వద్ద కొనుగోలుకు మొగ్గు చూపారు.
సెన్సెక్స్ నేడు ఉదయం 51,897 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,382 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,808 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,455 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,593 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,419 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11.20 సమయానికి సెన్సెక్స్ 748 పాయింట్లు లాభపడి 52,352 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,578 పాయింట్ల ట్రేడ్ అయింది.

మార్కెట్లు వరుసగా ఆరు సెషన్లు నష్టపోయాయి. నిన్న లాభాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు అంతకుమించి పరుగు పెట్టాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, టీసీఎస్, హిండాల్కో ఉన్నాయి.


Click it and Unblock the Notifications