దేశవ్యాప్తంగా ఉన్న రహదారులపై ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రయాణాల్లో దాదాపు చాలా టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్లు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్థానిక నివాసితుల కోసం NHAI Toll Rules లో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. దీని గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు.

టోల్ ప్లాజా (Toll Plaza) పరిధికి 20 కిలోమీటర్ల లోపల నివసించే రోజువారీ ప్రయాణీకులు టోల్ ఫీజు కట్టకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నిబంధన స్థానిక ప్రయాణీకులకు, అత్యవసర సేవలకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రత్యేకంగా స్థానిక ప్రయాణీకులపై రోజువారీ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.
20 కిలోమీటర్ల నియమం (20-km Rule) అంటే ఏమిటి?
టోల్ రూల్స్ (NHAI Toll Rules) ప్రకారం.. వాహనదారుడి చిరునామా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే.. వారు టోల్ పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి.. ప్రయాణీకులు తమ అడ్రెస్ ప్రూఫ్ ని (Valid Address Proof) సమర్పించాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కరెంట్ బిల్లులు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చెల్లుతాయి.
ఈ మినహాయింపు 'Pay As You Use' విధానం కిందకు వస్తుంది. దీని అమలుకు జీఎన్‌ఎస్‌ఎస్ (GNSS-based tracking technology) ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డిజిటల్ టోలింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించడం దీని లక్ష్యం.
ఈ వాహనాలకు మినహాయింపు
స్థానిక నివాసితులతో పాటు కొన్ని ప్రత్యేక కేటగిరీల వాహనాలకు కూడా టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా మినహాయింపు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం జరగకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశం. ఇందలో భాగంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు, పోలీసు వాహనాలు, అంబులెన్సులు, అగ్నిమాపక దళ వాహనాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలతో సహా మిలటరీ వాహనాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సహాయక చర్యల్లో పాల్గొనే వాహనాల వంటివి మినహాయింపు పొందుతాయి.
ఫాస్టాగ్ తప్పనిసరి..
ఇకపోతే నవంబర్ 2025 నుండి టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) తప్పనిసరి చేశారు. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు నగదు చెల్లిస్తే రెట్టింపు టోల్ ఛార్జీ, యూపీఐ (UPI) ద్వారా చెల్లిస్తే సాధారణ ఛార్జీ కంటే 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. ఈ నిబంధన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం 3 నిమిషాల కంటే ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తే.. ఆ వాహనదారుడు టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు స్థానిక ప్రయాణీకులకు ఉపశమనం కల్పించేలా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి నివాస ధృవీకరణ పత్రాలు చూపించిన పక్షంలో మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఒక టోల్ ప్లాజా నుండి 60 కిలోమీటర్ల లోపు ఉన్న మరో టోల్ ప్లాజా వద్ద కూడా కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. టోల్ సంబంధిత సమస్యలు లేదా సందేహాల కోసం వాహనదారులు జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నంబర్ 1033కు కాల్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications