Paytm News: పేటీఎంపై బాంబ్ పేల్చిన టోల్ కలెక్టర్.. ఫాస్టాగ్ మార్కెట్‌లో 30 శాతా వాటా ఫసక్
Fastag News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో సతమతం అవుతున్న ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంకు పలు సంస్థలు వరుసగా షాకులు ఇస్తున్నాయి. ఈపీఎఫ్‌ఓ, వ్యాపార సంఘాలు ఇప్పటికే పేటీఎం వినియోగాన్ని నిలిపివేయగా మరో సంస్థ ఆ జాబితాలోకి చేరింది. తాజా నిర్ణయంతో కంపెనీ వ్యాపారం మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని NHAIకు చెందిన టోల్ వసూలు విభాగం పేటీఎంకు గట్టి షాక్ ఇచ్చింది. ఫాస్ట్ ట్యాగ్ కొనుగోళ్ల కోసం ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) తాజాగా జారీచేసిన 32 అధీకృత బ్యాంకుల లిస్టుల పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేసింది.

IHMCL ప్రకటించిన 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యెస్ బ్యాంకులు ఉన్నాయి. కాగా ఇంతకుముందు జనవరి 19, 2024 నాటి IHMCL లేఖలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయకుండా కూడా నిరోధించింది.
దేశంలో 8 కోట్ల మంది ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఉన్నారని NHAI సీనియర్ అధికారి తెలిపారు. ఈ బిజినెస్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) 30 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. ఇప్పటికే కుప్పకూలుతున్న పేటీఎంకు ఇది మరింత నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications