Rajmargyatra: దేశంతో పాటు ఇక్కడి టూరిజం సైతం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే టూరిస్టులు వారి ప్రయాణ అవసరాలను తీర్చుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ అది అన్ని నీడ్స్ తీర్చదు. ఈ ఇబ్బందిని గుర్తించిన కేంద్రం కొత్తగా ఓ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చర్యలు చేపట్టింది. 'సిటిజన్-సెంట్రిక్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్'ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా 'రాజ్ మార్గ్ యాత్ర' అనే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్స్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశంలోని రహదారుల గురించి సమగ్ర సమాచారాన్ని ప్రయాణికులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు సైతం చేయవచ్చు. సంబంధిత యంత్రాంగం దానిపై చర్యలు తీసుకుంటుంది. ఈ యాప్ లోని 4 ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.
రహదారిపై ఉన్న లైవ్ ట్రాఫిక్, టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంక్స్, హాస్పిటల్, హోటల్స్, ట్రాఫిక్ ఆంక్షల సమాచారం ఇందులో పొందవచ్చు. హైవే గురించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే జియో-ట్యాగ్ చేసిన ఫొటోస్, వీడియోల ద్వారా డైరెక్టుగా ప్రభుత్వానికి నివేదించవచ్చు. ఫాస్టాగ్ రీఛార్జ్, నెలవారీ పాస్ లు సహా NHAI సేవలు ఒకేచోట అందుకోవచ్చు. వాహనాన్ని నడిపేటప్పడు ఓవర్ స్పీడ్ వంటి సురక్షిత డ్రైవింగ్ నోటిఫికేషన్స్ సైతం పొందొచ్చు.


Click it and Unblock the Notifications