New Fastag rule: రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుంచి ప్రభుత్వం టోల్ రుసుము వసూలు చేస్తుంది. ఆయా రోడ్ల నిర్మాణం మరియు అభివృద్ధి కోసం వెచ్చించిన మొత్తాన్ని ఇలా తిరిగి రాబడుతుంది. గతంలో ఈ చెల్లింపులన్నీ పూర్తిగా నగదుతోనే చేసేవారు. కానీ సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రస్తుతం 'ఫాస్టాగ్' ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా దీనిపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.
'ఒక వాహనం, ఒక ఫాస్టాగ్' నిబంధనను అమల్లోకి తీసుకురావాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. వివిధ వాహనాలకు ఒకే ఫాస్టాగ్ ని ఉపయోగించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. నిర్దిష్ట వాహనానికి పలు ఫాస్టాగ్ లను లింక్ చేయడాన్ని కూడా ఆపేయాలని సూచించింది. కాగా ఈ మారిన నిబంధనలు ఏప్రిల్ 1 నుంంచి అమల్లోకి వచ్చాయి

ఇంతకు ముందే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే పేటీఎంలో తలెత్తిన సంక్షోభం వల్ల ఆ ఫాస్టాగ్ వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో మార్చి చివరి వరకు గడువు పొడిగించింది. ఇప్పుడు అదికాస్తా పూర్తి కావడంతో ఏప్రిల్ 1 నుంచి ఒకే ఫాస్టాగ్ ను వివిధ వాహనాలకు ఉపయోగించే అవకాశం లేదు.
ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద నిరాటంకంగా సాగిపోయేందుకు NHAI ఈ చొరవను అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో సుమారు 98 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ను వినియోగిస్తున్నారు. దాదాపు 8 కోట్ల మంది వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications