ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు రోడ్లంటే గుంతలు, ప్రయాణమంటే నరకం అనుకునే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వేదికపై తెలుగు గడ్డ సత్తా చాటింది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) నిర్మాణంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒకేసారి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Record) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏమిటా రికార్డులు?
రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ అద్భుతం సాధ్యమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో నిరంతరాయంగా పనులు చేస్తూ ఈ కింద పేర్కొన్న మైలురాళ్లను అధిగమించారు:
- 28.95 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం.
- 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేయడం.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఇది భారత్, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ క్షణం అని కొనియాడారు.
గంటల ప్రయాణం.. నిమిషాల్లోనే!
సాధారణంగా అమరావతి నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఇప్పుడు సుమారు 11 నుండి 12 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ 6-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే.. ఆ సమయం ఏకంగా 6 గంటలకు తగ్గిపోతుంది. అంటే సగం సమయం ఆదా అన్నమాట! ఇది గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా వెళ్తుంది. తద్వారా ఈ ప్రాంతాల ఆర్థిక పురోగతికి ఊతం ఇవ్వనుంది.
నితిన్ గడ్కరీ విజన్.. చంద్రబాబు సంకల్పం
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని భారత్‌మాలా ఫేజ్-2 లో భాగంగా ఈ ప్రాజెక్ట్ సాగుతోంది. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. "ఇండియా బిల్డ్స్.. ఆంధ్రప్రదేశ్ డెలివర్స్" (భారత్ నిర్మిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది) అంటూ సీఎం చంద్రబాబు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముందుంది అసలైన వేట!
అయితే రికార్డుల పర్వం ఇక్కడితో ఆగిపోలేదు. జనవరి 11, 2026 నాటికి ప్యాకేజీ 2, 3 లలో మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Record)సాధించేందుకు ఇంజనీర్లు, కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాదాపు రూ. 19,300 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ 518-624 కిలోమీటర్ల హైవే.. ఏపీ కనెక్టివిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టనుంది.
పెట్టుబడులే లక్ష్యంగా..
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇలాంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలకు ఈ రహదారి ఒక వరప్రదాయినిగా మారనుంది. గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కావడంతో, ఇది ప్రధాన నగరాల రద్దీని తగ్గిస్తూనే, కొత్తగా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం చేస్తుంది.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన మౌలిక సదుపాయాలతో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. ఈ స్పీడ్ చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ రోడ్లపై ప్రయాణం విమాన ప్రయాణంలా సాఫీగా సాగిపోవడం ఖాయం!
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications