బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై నయా టోల్ విధానం!
కర్ణాటకలో ఎంతో కీలకమైన 117 కిలోమీటర్ల బెంగళూరు మైసూర్ (Bengaluru - Mysuru) యాక్సెస్-కంట్రోల్డ్ హైవే (NH-275) పై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ హైవేపై వాహనాలు ఎక్కడా ఆగకుండా టోల్ కట్ అయ్యేలా తీసుకురావాలనుకున్న 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) టోల్ కలెక్షన్ సిస్టమ్ ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. దీనికి బదులుగా, ప్రయాణికులు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసే 'క్లోజ్డ్, డిస్టెన్స్-బేస్డ్ టోల్ మెకానిజం' (Distance-based tolling) ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఒక సాంకేతిక సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకు ఈ ప్లాన్ మార్చారు?
నిజానికి బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేను ట్రాఫిక్ జామ్‌లు లేని కారిడార్‌గా మార్చడానికి ఎన్‌హెచ్‌ఏఐ మొదట ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టమ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలనుకుంది. దీనికోసం టెండర్లు కూడా పిలిచారు. కానీ, ఒకే హైవేపై ఒకేసారి రెండు వేర్వేరు టోల్ విధానాలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం దూరానికి తగినట్లుగా టోల్ వసూలు చేసే 'క్లోజ్డ్ సిస్టమ్' వైపు మొగ్గు చూపడం వల్ల పాత ప్రతిపాదనను నిలిపివేశారు. ఈ దూరాధారిత టోల్ సిస్టమ్ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక, భవిష్యత్తులో వీలును బట్టి ఎంఎల్ఎఫ్ఎఫ్ టెక్నాలజీని పరిశీలిస్తామని సీనియర్ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
అసలు ఏంటి ఈ 'బారియర్-రహిత' టెక్నాలజీ?
ఎన్‌హెచ్‌ఏఐ పక్కనబెట్టిన ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టమ్ కింద.. హైవేలపై ఉండే సాధారణ టోల్ ప్లాజాల స్థానంలో రోడ్డుకు పైభాగంలో పెద్ద పెద్ద గేట్‌వేస్ (Overhead gantries) ఏర్పాటు చేస్తారు. వీటికి హై-పెర్ఫార్మెన్స్ ఆర్‌ఎఫ్ఐడీ (RFID) ఫాస్ట్‌ట్యాగ్ రీడర్లు, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు , శాటిలైట్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ టెక్నాలజీలను అమర్చుతారు. దీనివల్ల వాహనాలు వేగంగా వెళ్తున్నప్పటికీ, ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. భారతదేశంలో ఇలాంటి మొట్టమొదటి సిస్టమ్‌ను ఆగస్టు 2025లో గుజరాత్‌లోని చోర్యాసి ఫీజ్ ప్లాజా వద్ద విజయవంతంగా ప్రారంభించారు.
కొత్తగా వచ్చే 'డిస్టెన్స్-బేస్డ్' టోల్‌తో లాభం ఏంటి?
ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్న క్లోజ్డ్, డిస్టెన్స్-బేస్డ్ టోల్ విధానం వల్ల తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు భారీగా డబ్బులు ఆదా అవుతాయి. ఈ సిస్టమ్‌లో హైవేపై వేర్వేరు చోట్ల మల్టిపుల్ ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. వాహనదారులు ఏ పాయింట్ వద్ద హైవే ఎక్కారు, ఏ పాయింట్ వద్ద బయటకు వెళ్లారు అనే దాన్ని బట్టి.. వారు ప్రయాణించిన ఖచ్చితమైన దూరానికి (Exact distance) మాత్రమే టోల్ ఛార్జ్ చేస్తారు. పూర్తి కారిడార్‌కు ఒకే ఫిక్స్‌డ్ టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఇది చాలా ఫెయిర్ సిస్టమ్ అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి హైవేను కొద్ది దూరం మాత్రమే వాడే స్థానిక ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట కానుంది.


Click it and Unblock the Notifications