Toll fee hike: గత పదేళ్ల కాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రోడ్ల నిర్మాణంలో చురుకుగా వ్యవహరించింది. ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే వడ్డింపుల విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరోసారి సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా రహదారులపై టోల్ గేట్ రుసుమను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సగటున 5 శాతం పెంచినట్లు తెలుస్తోంది. ఈ పెరిగిన ధరలు జూన్ 3వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. నిజానికి ఈ పెంపు ఏప్రిల్ నుంచే మొదలు కావాల్సి ఉంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తేదీని కొంతమేర పొడిగించారు. ఇప్పుడు అవి కాస్తా ముగియడంతో పాత నిర్ణయాన్ని అమలు చేయనుంది.

ఇలా ఎన్నికలు ముగిస్తాయో లేదో వెంటనే బాదుడు మొదలెట్టేశారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పన్నులు వసూలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని పలువురు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న మేరకు రోడ్ల అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా మోదీ సర్కారు ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన ప్రకటన కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల సమూల నిర్మూలన సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అంతలోనే మరో కొత్త బాదుడుతో విమర్శకుల నోటికి పని కల్పించినట్లయింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications