ప్రస్తుతం భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. అయితే కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వాటి ద్వారా ఆదాయాన్ని కూడా ప్రజలకే అందేలా ప్లాన్ చేస్తోంది. దీనికై ఒక పథకం తీసుకొచ్చారు. అదే ఇన్విట్(InvIT). దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోడ్డు ప్రాజెక్టులల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు ప్రభత్వం కొత్తగా 'రాజ్ మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్' (RIIT) ను ఏర్పాటు చేసింది. ఇక్కడ సమర్పించిన రూ. 9,500 కోట్ల బిడ్‌ను NHAI ఆమోదించింది.
అసలు ఈ పథకం ఏంటి?
ప్రభుత్వం తన వద్ద ఉన్న పని పూర్తయిన (Operational) రోడ్లను 'మానిటైజేషన్' చేస్తోంది. అంటే ఈ రోడ్ల ద్వారా వచ్చే టోల్ ఆదాయంపై హక్కులను ఇన్వెస్టర్లకు కల్పిస్తుంది. దీని కోసం InvIT (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) అనే పద్ధతిని వాడుతున్నారు. ఇందులో భాగంగా మన దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న 260 కిలోమీటర్ల మేర ఐదు ప్రధాన హైవే విభాగాలను ఈ పథకం కింద చేర్చారు.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా..
ఎంపిక చేసిన ఐదు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట - విజయవాడ కారిడార్ (69.4 కిమీ) కూడా ఉంది. దీనితో పాటు జార్ఖండ్‌లోని గోర్హర్-బర్వా అడ్డా, తమిళనాడులోని చెన్నై బైపాస్, చెన్నై-తడ విభాగాలు, కర్ణాటకలోని నేలమంగళ-తుమకూరు రహదారులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యధిక ట్రాఫిక్ ఉండే మార్గాలు. కాబట్టి వీటి ద్వారా వచ్చే టోల్ ఆదాయం చాలా స్థిరంగా ఉంటుంది.
మీ పెట్టుబడికి రాబడి ఎలా వస్తుంది?
మనం కంపెనీ షేర్లలో పెడితే లాభనష్టాలు ఆ కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. కానీ, ఇక్కడ మీ రాబడి రోడ్ల మీద తిరిగే వాహనాలపై ఆధారపడి ఉంటుంది.
- టోల్ వసూళ్లు: ఈ హైవేలపై వాహనాలు ప్రయాణించినప్పుడు వసూలు చేసే టోల్ ఫీజు నేరుగా ఇన్వెస్టర్లకు పంపిణీ చేయబడుతుంది.
- ట్రాఫిక్ వృద్ధి: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగే కొద్దీ వాహనాల రాకపోకలు పెరుగుతాయి. ట్రాఫిక్ పెరిగితే టోల్ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ లాభం కూడా పెరుగుతుంది.
- స్థిరమైన ఆదాయం: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, టోల్ ద్వారా వచ్చే ఆదాయం నిలకడగా ఉంటుందని NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తెలిపారు.
సామాన్యులకు గర్వకారణం
"ఈ పబ్లిక్ ఇన్విట్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం లాభాలు పొందడమే కాకుండా దేశ మౌలిక సదుపాయాల కల్పనలో తాము కూడా భాగస్వామ్యం వహించామనే గర్వాన్ని పొందుతారు" అని NHAI ఛైర్మన్ పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో కేవలం విదేశీ కంపెనీలు లేదా పెద్ద సంస్థలు మాత్రమే పెట్టుబడి పెట్టేవి. కానీ, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా తమ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇందులో యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.
మొత్తంగా చూస్తే.. వచ్చే 3 నుండి 5 ఏళ్లలో మరో 1,500 కిలోమీటర్ల హైవేలను ఈ ట్రస్ట్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఒక అద్భుతమైన మార్గంగా మారనుంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications