Next Fed Meeting in January: ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ (FOMC) బుధవారం సమావేశమవుతోంది. ఇటీవలి నెలల్లో వరుసగా వడ్డీ రేట్ల కోతలు చేసిన తర్వాత.. ఈ సమావేశంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతుందని మార్కెట్లు విస్తృతంగా అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఫెడరల్ నిధుల రేటు 3.5 శాతం నుంచి 3.75 శాతం మధ్యలో ఉంది. ఈ శ్రేణిలోనే రేటును కొనసాగించాలా లేదా మరోసారి తగ్గించాలా అనే అంశంపై విధాన నిర్ణేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గత మూడు సమావేశాల్లో ఫెడరల్ రిజర్వ్ ప్రతి సారి పావు శాతం పాయింట్ చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది. ఉద్యోగ మార్కెట్ మందగమనం తీవ్రమైన నిరుద్యోగ సమస్యగా మారకుండా అడ్డుకోవడమే ఈ కోతల ప్రధాన ఉద్దేశ్యం. అయితే, ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒకవైపు ఉద్యోగ విభాగంలో బలహీనతలు కనిపిస్తుండగా.. మరోవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది.

ఫెడరల్ రిజర్వ్‌కు కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటుగా ఉపాధిని పెంచడం. అయితే ఇటీవలి నెలల్లో ఈ రెండు లక్ష్యాలూ విరుద్ధ దిశల్లో కదులుతున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు వ్యాపారాలు నియామకాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తాయి. అదే సమయంలో అవి వినియోగాన్ని పెంచి ద్రవ్యోల్బణాన్ని మళ్లీ ఊపందుకునేలా చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ కారణంగానే ఫెడ్ అధికారులు స్పష్టంగా విభజించబడ్డారు.
డిసెంబర్ FOMC సమావేశం తర్వాత ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ.. నిరుద్యోగానికి సంబంధించిన ప్రమాదాలు పెరుగుతున్నాయి, అలాగే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని చాలా మంది అంగీకరిస్తున్నారు. అయితే మనకు ఒకే ఒక సాధనం ఉంది. ఒకేసారి రెండు సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. ఏ వేగంతో ముందుకు కదలాలన్నదే అసలైన సవాలు అని వ్యాఖ్యానించారు.
వరుసగా మూడు వడ్డీ రేటు కోతల అనంతరం.. ఇప్పుడు ఆర్థిక మార్కెట్లు ఫెడ్ కొంత విరామం తీసుకుంటుందని భావిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఏ దిశలో వెళ్తోంది? ఉద్యోగాల సమస్య పెద్దదా, ద్రవ్యోల్బణం ప్రమాదమా? అనే అంశాలపై మరింత స్పష్టత రావాలంటే రేట్లను యథాతథంగా ఉంచడమే సరైన నిర్ణయమని చాలా మంది పెట్టుబడిదారులు అభిప్రాయపడుతున్నారు. CME గ్రూప్ నిర్వహించే ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం.. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు మారకుండా ఉండే అవకాశం 97 శాతంగా ఉంది.
ఫెడ్ ఫండ్స్ రేటు క్రెడిట్ కార్డులు, కారు రుణాలు వంటి స్వల్పకాలిక రుణాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో, పరోక్షంగా హౌసింగ్ లోన్లు, ఇతర దీర్ఘకాలిక రుణాలపై కూడా ప్రభావం చూపుతుంది. తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా ఖర్చును ప్రోత్సహించి ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయి. అధిక వడ్డీ రేట్లు డిమాండ్‌ను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
ఈ సమావేశానికి మరో రాజకీయ కోణం తోడైంది. ఫెడ్ చైర్మన్ పావెల్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గొడవలు ఇటీవల మరింత పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణ ఖర్చుల విషయంలో పావెల్ కాంగ్రెస్‌ను తప్పుదోవ పట్టించారా అనే అంశంపై న్యాయ శాఖ జనవరి మధ్యలో క్రిమినల్ దర్యాప్తును ప్రారంభించింది. పావెల్ తన నిర్ణయాలు రాజకీయ ఒత్తిళ్లకు లోబడకుండా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, పావెల్ పదవీకాలం మే నెలలో ముగియనుంది. ఆయన తరువాతి చైర్మన్‌గా ఎవరు వస్తారన్న అంశంపై ట్రంప్ ఇప్పటికే బహిరంగ చర్చకు తెరలేపారు. కెవిన్ హాసెట్, కెవిన్ వార్ష్ వంటి పేర్లతో పాటు, ఇటీవలి కాలంలో బ్లాక్‌రాక్ ఎగ్జిక్యూటివ్ రిక్ రీడర్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఫెడ్ సమావేశం కేవలం వడ్డీ రేట్లకే కాదు, అమెరికా ఆర్థిక విధాన భవిష్యత్తుకూ కీలకంగా మారనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications