న్యూఢిల్లీ: మరో దఫా స్పెక్ట్రం వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో 2,251 మెగా హెడ్జ్‌ల స్పెక్ట్రంను వేలం వేయాలని నిర్ణయించారు. 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ బాండ్లలో మొత్తం
2,251.25 మెగా హెడ్జ్‌ల స్పెక్ట్రంను 2021 మార్చిలో వేలం వేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర న్యాయ, టెలికం, ఐటీ శాఖల మంత్రి రవిశంకర ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ స్పెక్ట్రం వ్యాల్యూ (రిజర్వ్ ధర వద్ద) రూ.3,92,332.70 కోట్లుగా పేర్కొన్నారు. స్పెక్ట్రంను 20 ఏళ్ల కాలానికి విక్రయిస్తారు. ఈ నెలలోనే టెలికం ఆపరేటర్ల నుంచి బిడ్స్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు టెలికం శాఖ నోటీసులు పంపిస్తుంది.

ట్రాయ్ ధర ప్రకారం...
ట్రాయ్ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో ట్రాయ్ రూ.5.22 లక్షల కోట్లను రిజర్వ్ ధరగా పేర్కొంది. ఇప్పుడు కంపెనీలు పోటీపడితే ఈ ఆదాయం రూ.3.92 లక్షల కోట్ల కంటే పెరిగే అవకాశముంది. స్పెక్ట్రం బాండును బట్టి కంపెనీలు 25 నుంచి 50 శాతం ధరను ముందుగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని రెండేళ్ల తర్వాత 16 వార్షిక సమాన వాయిదాల్లో చెల్లించాలి.

5G వేలం ఇప్పుడే కాదు
5G సేవలకు వినియోగించే 3300-3600 మెగా హెడ్జ్ బాండ్ స్పెక్ట్రంను ఇప్పుడే వేలం వేయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. టెలికం విభాగపు నిర్ణయాత్మక సంస్థ ది డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మే నెలలో రూ.5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రం వేలానికి అనుమతి ఇచ్చింది. ఇందులో 5G సేవలు కూడా ఉన్నాయి. అయితే 5G సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంలో కొంత భాగాన్ని వినియోగిస్తున్నట్లు నావికా దళం, అంతరిక్ష విభాగాలు తెలిపాయి. 5G స్పెక్ట్రం కోసం ప్రతి ఆపరేటర్ రూ.50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. దానికి నిర్ణయించిన ప్రాథమిక ధరను తగ్గించాలని టెలికం పరిశ్రమ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

బేస్ ప్రైస్ తగ్గించాలని
5G స్పెక్ట్రం బేస్ ప్రైస్‌ను తగ్గించాలని టెలికం సంస్థలు కోరుతున్నాయి. ఒక్కో టెలికం ఆపరేటర్ 5G సేవలకు అవసరమైన స్పెక్ట్రంను పొందాలంటే దాదాపు రూ.50,000 కోట్లు వెచ్చించాలి. అయితే 2016లో తీసుకువచ్చిన నిబంధనలే రాబోయే స్పెక్ట్రం వేలం చెల్లింపులకు వర్తిస్తాయని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం వేలంలో విజేతలు బిడ్ ధరతో పాటు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి తమ రెవిన్యూ (ఏజీఆర్)లో 3 శాతాన్ని చెల్లించాలని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications