జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు సిమెంట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ద్వారా రూ. 4,000 కోట్ల వరకు సమీకరించడానికి త్వరలో సెబికి డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 10న జెఎస్ డబ్ల్యూ సిమెంట్ లిస్టింగ్ ప్లాన్‌లను మొదటిసారిగా మనీకంట్రోల్ పేర్కొంది. ఆగస్ట్ 2021లో నిర్మా గ్రూప్-మద్దతు గల Nuvoco Vistas రూ. 5,000 కోట్ల ప్రారంభ వాటా విక్రయం తర్వాత ఈ రంగంలో మార్కెట్ ప్రవేశం మొదటి అతిపెద్ద IPO అయ్యే అవకాశం ఉంది.
"రాబోయే కొద్ది రోజుల్లో JSW సిమెంట్ ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఫైల్ చేయాలనేది ప్లాన్" అని తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు. IPOలో రూ. 2,000 కోట్ల తాజా ఇష్యూ ఉండగా.. రూ. 2,000 కోట్ల విక్రయానికి ఆఫర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జెఎస్ డబ్ల్యూ సిమెంట్ ఐపీఓగా వస్తుందన్న వార్తలతో శివ సిమెంట్ షేర్లు 15 శాతం పెరిగాయి. శివ సిమెంట్ ను జెఎస్ డబ్ల్యూ సిమెంట్ 2017లో కొనుగోలు చేసింది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో రాబోయే ఐదేళ్లలో సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దేశంలోని మొదటి ఐదు సిమెంట్ ఉత్పత్తిదారులలో ఒకటిగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది కంపెనీ.

ఈ ఐపీఓకు సంబంధించి వచ్చిన వార్తలపై జెఎస్ డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధిని సంప్రదించగా.. అతను మాట్లాడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓగా వచ్చింది. జెఎస్ డబ్ల్యూ సిమెంట్ కు JM ఫైనాన్షియల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జెఫరీస్, యాక్సిస్ క్యాపిటల్, DAM క్యాపిటల్, సిటీ, గోల్డ్‌మన్ సాక్స్, SBI క్యాపిటల్ పెట్టుబడి బ్యాంకులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓరియంట్ సిమెంట్‌లో ప్రమోటర్ వాటాను కొనుగోలు చేయడానికి రేసులో ఉన్న కంపెనీల్లో జెఎస్ డబ్ల్యూ కంపెనీ కూడా ఉంది.
బిర్లా గ్రూప్‌కు చెందిన మార్కెట్ లీడర్ అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ గ్రూప్‌కు చెందిన ACC-అంబుజా కాంబినేషన్ మధ్య పోటీ పెరుగుతోన్న నేపథ్యంలోJSW సిమెంట్ దలాల్ స్ట్రీట్‌లో అరంగేట్రం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. జెఎస్ డబ్ల్యూ సిమెంట్ జూలై 2021లో ఇద్దరు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు, అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంక్. (దాని మేనేజ్డ్ ఫండ్స్ ద్వారా), సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్ నుంచి రూ. 1,500 కోట్లను సేకరించింది.
మార్చి 2024 నాటికి, JSW సిమెంట్ సామర్థ్యం 20.6 mtpa గా ఉంది.


Click it and Unblock the Notifications