IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి నేడు రెండవ కంపెనీ అడుగుపెట్టి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించి వారిని సంతోషంలోకి నెట్టేసింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది న్యూజైసా టెక్నాలజీస్ ఐపీవో గురించే. ఇది ఎస్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అడుగుపెట్టింది. ఇష్యూ ధర కంటే 51 శాతం అధిక ప్రీమియం రేటు రూ.71 వద్ద లిస్టింగ్ జరిగింది. కంపెనీ ఐపీవో కోసం షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.44-47గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీ ఐపీవో కోసం లాట్ పరిమాణం 3000 ఈక్విటీ షేర్లను విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవోను సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 27 వరకు గతంలో తెరచి ఉంచింది.

విశేష్ హండా, ముకుంద్ రాఘవేంద్ర కంపెనీకి ప్రమోటర్లుగా ఉన్నారు. సెప్టెంబర్ 16, 2023 నాటికి ప్రమోటర్లు సమిష్టిగా 1,78,56,000 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ పోస్ట్-ఇష్యూ సబ్‌స్క్రైబ్డ్, పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 53.69%. కంపెనీ ఐపీవో సొమ్మును యంత్రాల కొనుగోలు, బ్రాండింగ్ వంటి వ్యాపార అవసరాలతో పాటు కార్పొరేట్ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
2020లో ప్రారంభించబడిన కంపెనీ రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, పెరిఫెరల్స్ వంటి ఉపయోగించిన గాడ్జెట్‌లను సేకరించి, వాటిని పునరుద్ధరించి, తుది వినియోగ కస్టమర్ల వ్యాపారాలు లేదా రిటైల్‌కు నేరుగా విక్రయిస్తుంది. IT ఉత్పత్తుల ప్రత్యక్ష విక్రయాలలో నిమగ్నమై ఉంది. న్యూజైసా టెక్నాలజీస్ ఈ-కామర్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులు, గృహ వినియోగదారులు, SMEలు, పని చేసే నిపుణులతో కూడిన పాన్ ఇండియా కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications