For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

new year 2021: డిసెంబర్ 31న అదరగొట్టిన జొమాటో! సీఈవోకే ఆశ్చర్యం

|

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ముఖ్యంగా హోటల్స్‌కు వెళ్ళడం తగ్గించారు. అవసరమైతే ఇంటికే తెప్పించుకోవడం గతంలో కంటే పెరిగింది. 2021 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో జొమాటో ఆర్డర్స్ ఆ సంస్థ సీఈవోకే ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ వైపు కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకోవాలనే ఆసక్తి,, కరోనా వల్ల జాగ్రత్తగా ఉండాలనే అంశం రెండూ కలిసి ఆర్డర్స్ భారీగా పెరిగాయి.

వాహనదారులకు గుడ్‌న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపువాహనదారులకు గుడ్‌న్యూస్, FASTag గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డేను అధిగమించి...

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డేను అధిగమించి...

జనవరి 1 వస్తుందంటే చాలు డిసెంబర్ 31 మధ్యాహ్నం లేదా సాయంత్రం నుండి హంగామా ఉంటుంది. చాలామంది డిసెంబర్ 31న సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుంటారు. వివిధ రకాలుగా ఆనందిస్తారు. దీంతో గురువారం సాయంత్రం (డిసెంబర్ 31) ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నిమిషానికి 3200 ఆర్డర్స్‌కు పైగా స్వీకరించింది. ఇప్పటి వరకు ఫుడ్ ఆర్డర్స్ పర్ మినట్ (opm) దాదాపు 2500గా ఉన్నాయి. అది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సందర్భంగా. ఇప్పుడు దానిని అధిగమించినట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. ఇది కూడా గురువారం సాయంత్రం 6 గంటల వరకేనని, రాత్రికి ఇంకా పెరుగుతాయేమోనని కూడా పేర్కొన్నారు.

నిమిషానికి 4100కు..

నిమిషానికి 4100కు..

ఆ తర్వాత కాసేపటికే నిమిషానికి 3200 ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొననారు. ఇందులో ఎక్కువగా పిజ్జాలు, బిర్యానీలు ఉన్నాయి. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆర్డర్స్ మరింతగా పెరిగాయి. నిమిషానికి 4100 ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపారు. పలు నగరాల్లో ఆంక్షల నేపథ్యంలో గురువారం రాత్రి నుండి ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరిగిందని, రద్దీ నేపథ్యంలో వీలైతే కస్టమర్లు ముందస్తుగా ఆర్డర్స్ బుక్ చేసుకోవాలని కోరారు.

పిజ్జా, బిర్యానీ ఆర్డర్స్

పిజ్జా, బిర్యానీ ఆర్డర్స్

కరోనా నేపథ్యంలో 2020లో చాలా నెలల పాటు దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆరంభంలో డెలివరీ యాప్స్‌కు కొంచెం డిమాండ్ తగ్గింది. 2020 రెండో అర్ధ సంవత్సరంలో తిరిగి గాడిన పడింది. గత ఏడాది నిమిషానికి 22 బిర్యానీలు డెలివరీ చేసింది జొమాటో. గత కొద్ది నెలలుగా పిజ్జా ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. మే నెలలో 4.5 లక్షల పిజ్జా ఆర్డర్స్ రాగా, నవంబర్ నాటికి 17 లక్షల ఆర్డర్స్‌కు చేరుకుంది.

English summary

new year 2021: డిసెంబర్ 31న అదరగొట్టిన జొమాటో! సీఈవోకే ఆశ్చర్యం | new year 2021: Zomato CEO Left Stunned as Food Delivery App Clocks in 4100 Orders Per Minute

With Covid-19 keeping many revellers indoors even on New Year's Eve, food delivery platforms seem to be having a hard time meeting the sudden spike in demand, with orders on Zomato alone going up to over 3,200 per minute on Thursday evening.
Story first published: Friday, January 1, 2021, 13:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X