MGNREGS News:ఉపాధిహామీ పథకం కిందకు మరిన్ని పనులు.. ఎగిరి గంతేస్తున్న ఆంధ్ర రైతులు..
MGNREGS changes: దాదాపు దశాబ్ధానికి పూర్వం దేశంలో ప్రవేశపెట్టబడిన మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్(MGNREGS) ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. సాధారణ రోజులే కాకుండా కరోనా సమయంలోనూ పేదలు ఎంతో మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కాగా ఈ స్కీమ్ పేరు నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో వినిపిస్తూనే ఉండటం గమనార్హం.
ఇప్పటివరకు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైన MGNREGSను మరిన్నింటికి విస్తరించాలని APలో తాజాగా కొలువైన చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన గురించి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కేంద్రం అనుమతి తీసుకుని మరిన్ని రంగాలను ఉపాధి హామీ పనికి అనుసంధానం చేస్తామన్నారు.

కాగా ఇటీవల వ్యవసాయం మరియు డెయిరీ డెవలప్‌మెంట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో పశుపోషణను పెంచేందుకు, పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సైజును బట్టి 90 శాతం రాయితీపై గేదెలు, ఆవుల కోసం షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. గరిష్ఠంగా 2.3 లక్షలు సబ్సిడీ ఇస్తామని తెలిపారు.
ఇక గొర్రెలు, మేకల షెడ్ల కోసం అంతే మొత్తంతో 70 శాతం మేర రాయితీ అందిస్తామని మంత్రి వెల్లడించారు. కేవలం పశుపోషకులకే కాకుండా కోళ్ల పెంపకం దారులకు కూడా మేలు జరిగేలా చూస్తామన్నారు. వారికి 70 శాతం సబ్సిడీతో 1.32 లక్షలు సాయం చేయనున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications