Paytm News: పేటీఎం అటాకింగ్ ప్లాన్ షురూ.. రంగంలోకి ట్రబుల్ షూటర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది?
Paytm CEO: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో పేటీఎం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పేమెంట్స్ బిజినెస్ లైసెన్సు సహా పలు చర్యలకు లోనైంది. దీంతో షేర్ విలువ దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కంపెనీని తిరిగి నిలబెట్టేందుకు, కస్టమర్ల విశ్వాసం పొందేందుకు CEO విజయ శేఖర్ శర్మ అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటికీ దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు.
పేటీఎం IPOగా మార్కెట్లోకి వచ్చిన సమయంలో ప్రమోటర్ వర్గీకరణ సరిగా జరగలేదంటూ తాజాగా నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝళిపించింది. CEO విజయ శేఖర్ శర్మకు ఈ మేరకు షోకాజ్ నోటీసులు పంపించింది. షేర్ హోల్డింగ్ విషయంలో తప్పులు దొర్లాయని చెబుతోంది. అయితే ఈ విషయం సెబీతో పాటు పలు ప్రాక్సీ సంస్థలకు కూడా ముందే తెలుసు. IPO సమయంలోనే ఈ వ్యవహారంపై పబ్లిక్‌గా వార్తలు వచ్చినా అప్పుడు సెబీ చూసీచూడనట్లు వ్యవహరించింది. RBI చర్యల అనంతరం కఠిన వైఖరి అవలంభిస్తోంది.

ఇటీవల కంపెనీలో జరుగుతున్న వ్యవహారాలను బట్టి కంప్లయన్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిబంధనల మేరకు నడుచుకోవడంలో ఫెయిల్ అవుతూ, నియంత్రణ సంస్థలకు అడ్డంగా దొరికిపోతోంది. దీనికి చెక్ పెట్టేందుకు పేటిఎం సబ్సిడరీ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం మనీ లిమిటెడ్ NV శ్రీనివాసన్ ను నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా అపాయింట్ చేసింది. హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కంప్లయన్స్ మరియు గవర్నెన్స్ మెయింటైన్ చేసేందుకుగాను ఆయనను నియమించినట్లు ప్రకటించింది.
శ్రీనివాసన్ కెరీర్ గ్రాఫ్ ను పరిశీలిస్తే 4 దశాబ్దాల పాటు ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో మంచి అనుభవం ఉంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI)కు గతంలో CEOగా సేవలందించారు. అంతకుముందు లక్ష్మీ విలాస్ బ్యాంకు CFO మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను పనిచేశారు. IDBI బ్యాంకులో అవే స్థాయిల్లో ఏకంగా 19 ఏళ్ల పాటు కొనసాగారు. సెబీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కమిటీ అండ్ కార్పొరేట్ బాండ్స్ మరియు సెక్యూరిటైజేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గానూ విధులు నిర్వర్తించారు. ఆయన సారథ్యంలోనైనా కంపెనీ కష్టాల నుంచి గట్టెక్కాలని నిపుణులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications