Pollution Control: దేశంలోని వాహనదారులకు షాక్ కొట్టింటే వార్త ఒకటి వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మంది చెప్పినా చాలా మంది మాత్రం వాహన చట్టంలోని నిబంధనలను పాటించరు. ఎన్నిసార్లు ఫైన్లు వేసినా వారిలో మార్పు రాకపోవటంతో అధికారులు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు.
ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వాహనదారులను సహజంగా అడిగేవి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్. చాలా మంది పోలీసు అధికారులకు అడిగినంత ఇచ్చి తప్పించుకుంటుంటారు. కానీ ఇకపై అలాంటి పప్పులు ఉడకవ్. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా మంది వాహనదారులకు ప్రస్తుతం నిద్రలేకుండా చేస్తోంది.

ఇకపై చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ జరిమానాలు విధించబడతాయి. దీంతో పాటు కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. వాస్తవానికి పొల్యూషన్ సర్టిఫికెట్ ముఖ్యమైన పత్రం అయినప్పటికీ చాలా మంది వాహనదారులు దానిని సకాలంలో రెన్యూవల్ చేసుకోవటంలో విఫలమవుతుంటారు.
ఇకపై ఈ సర్టిఫికేట్ లేని కార్లు రిజిస్ట్రేషన్ నుంచి బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి. ఆధునిక కెమెరాలతో వాహనాల నంబర్ ప్లేట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని గుర్తించినప్పుడు యజమాని మెుబైల్ నంబర్ కు ఎస్ఎమ్ఎస్ రూపంలో పెనాల్టీ వివరాలు తెలియజేయబడతాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఇకపై వాహనదరాలు గడువు ముగిసిన మరుసటి రోజు లేదా సాయంత్రం సర్టిఫికేట్ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
వాహనదారులకు తమ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకునేందుకు కొన్ని గంటల సమయం అందించబడుతుంది. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కొత్త విధానంతో పర్యావరణ కాలుష్యం అరికట్టడంతో పాటు కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైన తిరగకుండా చూడొచ్చని అంటున్నారు. ఈ భారీ జరిమానాతో వాహనదారులు తమ వాహన కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాన్ని సకాలంలో అప్‌డేట్ చేసుకునేలా చూస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications