పన్ను చెల్లింపుదారుల భారం తగ్గించే కొత్త ఆదాయపు పన్ను చట్టం!
భారత ఆదాయపు పన్ను చట్టానికి ఆరు దశాబ్దాల తర్వాత పెద్ద స్థాయిలో సంస్కరణలు రాబోతున్నాయి. ఆదాయపు పన్ను బిల్లు, 2025 పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన పరిశీలన నివేదికను జూలై 21, 2025 (సోమవారం)న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న Income Tax Act, 1961 స్థానంలోకి రానుంది. కొత్త చట్టంతో పన్నుదారులకు సరళత, స్పష్టత, తక్కువ వివాదాలు వంటి అనేక లాభాలు అందే అవకాశం ఉంది.

కొత్త చట్టం ప్రధానంగా ఈ విషయాలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించబడింది:
1. చట్టాన్ని క్లిష్టత నుంచి బయటకు తీయడం
2. న్యాయ వివాదాలను తగ్గించడం
3. పన్ను కాంప్లయన్స్‌ను సులభతరం చేయడం
పరిశీలన కమిటీ వివరాలు:
ఈ బిల్లును 31 మంది సభ్యులతో కూడిన కమిటీ, బీజేపీ నేత బైజయంత్ పాండా అధ్యక్షతన పరిశీలించింది. 2025 జనవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం, స్పీకర్ ఓం బిర్లా కమిటీని నియమించారు. జూలై 16న కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేసింది.
కొత్త బిల్లులో మార్పులు
పార్లమెంటరీ కమిటీ బిల్లుపై మొత్తం 285 మార్పులను సిఫార్సు చేసింది. ఈ మార్పులతో చట్ట పరిమాణంలో గణనీయమైన తగ్గింపు జరిగింది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రస్తుతం ఉన్న చట్టంతో పోలిస్తే గణనీయంగా సరళతను చేకూర్చేలా రూపొందించబడింది. IT శాఖ FAQs ప్రకారం, ఇది పాత చట్టం కన్నా సగం పరిమాణంలోనే ఉన్నదిగా పేర్కొన్నారు. కొత్త చట్టంలో కేవలం 2.6 లక్షల పదాలే ఉండగా, పాత ఆదాయపు పన్ను చట్టం, 1961 లో 5.12 లక్షల పదాలు ఉన్నాయి. సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అదే విధంగా, చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి కుదించారు.
చట్టాన్ని మరింత స్పష్టతతో రూపొందించేందుకు, వ్యాఖ్యలు (comments) మరియు అనవసరమైన నిబంధనలను తీసేశారు. కొత్త బిల్లులో 57 టేబుళ్లు ఉంటే, పాత చట్టంలో 18 టేబుళ్లే ఉన్నవి. అలాగే, 1,200 అనుబంధ నిబంధనలు (provisos) మరియు 900 స్పష్టీకరణలు (explanations) తొలగించబడ్డాయి. ఈ మార్పులన్నీ కలిసి పన్ను చట్టాన్ని క్లిష్టత నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా, పన్నుదారులకు అర్థం చేసుకునేలా మరియు అమలు చేయదగిన విధంగా రూపొందించడంలో కీలకంగా నిలుస్తున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "పాత చట్టంతో పోలిస్తే పదాల సంఖ్యను సగానికి తగ్గించాం. సెక్షన్లను కూడా 819 నుంచి 236కి కుదించాం. ఇది పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా రూపొందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతోనే జరిగింది," అని పేర్కొన్నారు.
TDS/TCS లాంటి అంశాలను టేబుల్ ఫార్మాట్ లో ఇవ్వడం వల్ల అవి సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. నాన్-ప్రొఫిట్ ఆర్గనైజేషన్ల కోసం ప్రత్యేకంగా మరింత స్పష్టతా చాప్టర్ పొందుపరిచారు. ఈ మార్పుల వల్ల 34,547 పదాలు తగ్గించబడ్డాయి అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఉదాహరణకి: 2023-24లో ఆర్జించిన ఆదాయానికి 2024-25లో పన్ను చెల్లించాలి. కొత్త చట్టంలో ఈ డ్యూయల్ స్ట్రక్చర్ తీసివేసి, అదే సంవత్సరంలో ఆదాయంపై పన్ను ఉంటుంది.
'Tax Year' అనే కొత్త పదం ప్రవేశపెట్టారు.


Click it and Unblock the Notifications


