తత్కాల్ టికెట్ బుకింగ్‌లో పెద్ద మార్పు: మొదటి 30 నిమిషాలు ఇక సామాన్యులకే!
ప్రయాణీకులకు భారీ ఉపశమనం కలిగించడానికి భారత రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ సిస్టంలో కీలక మార్పును ప్రకటించింది. ఇప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి 30 నిమిషాలు సాధారణ ప్రయాణీకులకు మాత్రమే కేటాయిస్తుంది. ఈ సమయంలో ఏ అధీకృత ఏజెంట్ లేదా థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతించదు. టికెట్ బుకింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అలాగే ఏజెంట్ల దందాని నిరోధించే లక్ష్యంగా రైల్వేలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ మార్పు ఎందుకు: ఇప్పటివరకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే అన్ని టిక్కెట్లు కొన్ని నిమిషాల్లోనే బుక్ అయిపోతుండేవని, వాటిలో పెద్ద సంఖ్యలో టిక్కెట్లను ఏజెంట్లు బ్లాక్ చేస్తున్నారని గమనించారు. ఈ కారణంగా సాధారణ ప్రయాణీకులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించి ఏజెంట్ల నుండి టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. రైల్వేల ఈ కొత్త నియమంతో సామాన్యులకు ఇప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది అలాగే వారికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యతతో అవకాశం లభిస్తుంది.
కొత్త రైల్వే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది:
ఈ కొత్త విధానం ప్రకారం, తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు ఇలా ఉంటాయి:
*ఏసీ కోటా కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
*స్లీపర్ కోటా కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
*ఈ ప్రారంభ సమయం నుండి మొదటి 30 నిమిషాలు కేవలం సాధారణ ప్రయాణీకులకు మాత్రమే కేటాయించబడుతుంది. దీని తర్వాత మాత్రమే ఏజెంట్లు లేదా ఇతర బుకింగ్ సర్వీస్ ప్రొవైడర్లు టిక్కెట్లు బుక్ చేసుకోగలరు.
AI చాట్‌బాట్ నిఘా: దీనితో పాటు రైల్వేలు డిజిటల్ భద్రతా వ్యవస్థను కూడా బలోపేతం చేశాయి. ఇప్పుడు టికెట్ బుకింగ్ ప్రక్రియను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పర్యవేక్షిస్తారు. ఇది ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా బాట్‌ల ద్వారా జరిగే అక్రమ బుకింగ్‌లను వెంటనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటుంది.
ఈ చర్య రైల్వే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కస్టమర్-కేంద్రీకృత విధానాలలో ఒక భాగం. ఇప్పుడు బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, టికెట్ బ్లాక్ మార్కెటింగ్ అలాగే ఏజెంట్ల ద్వారా అక్రమాలని కూడా అరికట్టగలదు. అయితే రైల్వేల ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. టికెట్ బుకింగ్‌లో సాధారణ ప్రజలకు సమాన అవకాశం కల్పించే దిశగా ఇది ప్రశంసనీయమైన ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. అంతేకాకూండా ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించి, ఏజెంట్ల దందాని అరికట్టగలదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications