For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త రూల్: విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి పదవీ గండం? జాబితాలో పెద్ద కంపెనీలు...

|

బెంగళూరు: విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి పదవీ గండం పొంచి ఉందట! మార్కెట్ రెగ్యులేటర్ SEBI కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో రిషద్ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఎగ్జిక్యూటివ్ రోల్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. అజీమ్ ప్రేమ్‌జీ గత ఏడాది తప్పుకోవడంతో ఆయన తనయుడు ఈ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పదవిని కోల్పోయే అవకాశముంది.

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?

సెబి నిబంధన ప్రకారం...

సెబి నిబంధన ప్రకారం...

SEBI నిబంధనల ప్రకారం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల చైర్మన్, సీఈవోలు వేర్వేరు వ్యక్తులు ఉండాలనే నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. విప్రో మాత్రం రిషద్‌నే కొనసాగించాలని సెబిని కోరింది. సెబి కొత్త నియమాల ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించాలి.

విప్రోకు సమాచారం

విప్రోకు సమాచారం

రిషద్‌ను కొనసాగించేందుకు అవకాశమివ్వాలని సెబిని విప్రో కోరినప్పటికీ మార్కెట్ నియంత్రణ సంస్థ నిరాకరించింది. రిషద్ చైర్మన్‌గా ఉండటంతో పాటు ఎగ్జిక్యూటివ్ రోల్ పాత్ర పోషిస్తే అది సెబి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని విప్రోకు సమాచారం కూడా అందించిందని తెలుస్తోంది.

ఈ ఆప్షన్ ఉంది..

ఈ ఆప్షన్ ఉంది..

అయితే మరోవైపు ప్రాక్సీ అడ్వైజరీ సర్వీసస్‌ ఎండీ శ్రీరాం సుబ్రహ్మణియన్ ఈ అంశంపై స్పందించారు. రిషద్‌కు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ పదవిని వదులుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జాయింట్ MD పదవులను స్వీకరించే అవకాశముందన్నారు.

వాటా ఉన్నా నిర్ణయాలు తీసుకోలేరు..

వాటా ఉన్నా నిర్ణయాలు తీసుకోలేరు..

సెబీ కొత్త నిమయాల మేరకు ప్రమోటర్లకు కంపెనీలో 74% షేర్లు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. విప్రో షేర్స్‌ను అజీమ్... ప్రేమ్‌జీ పౌండేషన్‌కు ఇచ్చినప్పటికి ఓటింగ్‌ హక్కులు కలిగి ఉంటారని కంపెనీలు వర్గాలు అంటున్నాయి. SEBI నిర్ణయంతో దాదాపు 214 కంపెనీలలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, లార్జ్ కార్పోరేట్స్ కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ వంటివి కూడా ఉన్నాయి.

English summary

కొత్త రూల్: విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీకి పదవీ గండం? జాబితాలో పెద్ద కంపెనీలు... | New SEBI rules: Wipro chairman Rishad Premji likely to lose executive role

Wipro chairman Rishad Premji may lose his executive role in the IT firm after 1 April this year in the wake of the new guidelines of the market regulator SEBI, said a news report.
Story first published: Thursday, January 2, 2020, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X