EPFO News: నిన్నటితో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 1న కొత్త ఫైనాన్షియల్ ఏడాది ప్రారంభంతోనే.. పలు ఆర్థిక నిబంధనల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా వేతన జీవుల కోసం EPF, NPS, ట్యాక్స్ విధానం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి రూల్స్ ను ప్రభుత్వం మార్చింది.
అయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగులు కంపెనీ మారిన అనంతరం వారి PF అకౌంట్స్‌ను మాన్యువల్‌గా కొత్త కంపెనీకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పద్ధతికి చరమగీతం పాడాలని EPFO భావించింది. ఆటోమేటిక్ విధానాన్ని అమలు చేయనుంది.

PF ఖాతా నిర్వహణ గురించి చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. ఓ కంపెనీని విడిచి మరో కంపెనీలో జాయిన్ అయిన అనంతరం సంస్థ HR విభాగం కొత్త PF అకౌంట్ క్రియేట్ చేస్తుంది. పాత ఖాతా మాత్రం అలానే ఉండిపోతుంది. ఎవరైనా పాత ఖాతాను కూడా కొత్త అకౌంట్‌తో విలీనం చేయాలంటే HR డిపార్ట్‌మెంట్‌కు రిక్వెస్ట్ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో చాలా మంది విఫలమై ఓ ఉద్యోగికి విభిన్న ఖాతాలు ఉంటున్నాయి.
ఈ పరిస్థితిని మార్చేందుకు EPFO తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి నుంచి అభ్యర్థన అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా పాత కంపెనీ ఖాతా కొత్త అకౌంట్‌లో విలీనం అయ్యేలా మార్పులు తీసుకువచ్చింది. ఉద్యోగుల పోర్టబిలిటీకి సంబంధించి ఇదో పెద్ద టాస్క్ కాగా కంపెనీల యాజమాన్యానికి కూడా PF ఖాతాల నిర్వహణ ప్రక్రియ సులభతరం అవుతుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications