New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!

కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 'ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026'ను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. మన దైనందిన ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డ్ (PAN Card) పాత్ర చాలా కీలకం. అయితే, ఈ కొత్త మార్పుల (New rules) వల్ల కొన్ని పనులు సులభతరం కాగా, మరికొన్నిటిపై నిఘా పెరగనుంది. ముఖ్యంగా ఆస్తి కొనుగోలు, నగదు ఉపసంహరణలు, హోటల్ బిల్లుల విషయంలో పరిమితులను ప్రభుత్వం సవరించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

New Rules for PAN card from April 1 2026 covering property cash limits and 10 major changes explained clearly

పాన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇకపై కఠినం

ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు ఉంటే సులభంగా పాన్ కార్డ్ వచ్చేసేది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఇది కుదరదు. ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం (Proof of Date of Birth) బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో లేదా పాస్‌పోర్ట్ వంటి అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, మీ ఆధార్‌ కార్డులో పేరు ఎలా ఉందో, పాన్ కార్డులో కూడా అక్షరం పొల్లు పోకుండా అలాగే ఉండాలి. పేర్లలో తేడాలు ఉంటే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.

నగదు లావాదేవీల్లో భారీ మార్పు

సాధారణంగా రోజుకు 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ కార్డు అడిగేవారు. ఇప్పుడు ఈ 'డైలీ లిమిట్' విధానాన్ని తీసేసి, 'ఇయర్లీ ట్రాకింగ్' (Yearly Tracking) విధానాన్ని తెచ్చారు. అంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం నగదు లావాదేవీలు (డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్) రూ. 10 లక్షలు దాటితేనే పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న అవసరాల కోసం నగదు జమ చేసేవారికి పాన్ కార్డు తలనొప్పి తప్పుతుంది.

వాహనాల కొనుగోలు , హోటల్ బిల్లులు

కొత్త కారు లేదా బైక్ కొనేవారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. గతంలో ఏ వాహనం కొన్నా పాన్ కార్డు అడిగేవారు, కానీ ఇప్పుడు రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు కొంటేనే పాన్ తప్పనిసరి. అలాగే హోటల్ బిల్లులు లేదా ఫంక్షన్ల కోసం చేసే ఖర్చుల పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచారు. అంటే లక్ష రూపాయల లోపు హోటల్ బిల్లులకు పాన్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు.

ఆస్తి కొనుగోలుదారులకు తీపి కబురు

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొంటే పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఇది మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అయితే ఇన్సూరెన్స్ రంగంలో నిబంధనలు కఠినమయ్యాయి. ఇకపై పాలసీ తీసుకునేటప్పుడే పాన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి.

మీరు ఏం చేయాలి?

ఈ కొత్త నిబంధనల (New rules) వల్ల డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే భారీ మొత్తంలో నగదు వాడేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 1 లోపు మీ ఆధార్ , పాన్ కార్డులలో వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+