అక్టోబర్ 1వ తేదీ నుండి ఆటో డెబిట్ రూల్స్ మారే అవకాశాలు ఉన్నాయి. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) లేదా ఇతర ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల ద్వారా చేసే పునరావృత ట్రాన్సాక్షన్స్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్(AFA) అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గతంలో స్పష్టం చేసింది. గత కొంతకాలంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. కరెంట్ బిల్లు మొదలు దాదాపు అన్ని బిల్స్‌ను కూడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆటో-డెబిట్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డెబిట్‌కు సంబంధించి కొత్త నిబంధనలను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాలతో దీనిని సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుండి ఆటో డెబిట్ రూల్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆటో డెబిట్ పద్ధతిలో ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసే చెల్లింపులు స్వయం చాలకంగా డెబిట్ అయ్యేలా బ్యాంకులకు కస్టమర్లు సూచనలు ఇచ్చే వీలుంది. ఈ చెల్లింపులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆధ్వర్యంలోని నాచ్ చూసుకుంటుంది. ఇందులో రుణ వాయిదాలతో పాటు క్రెడిట్ కార్డు బిల్స్, పెట్టుబడులు, బీమా పాలసీల చెల్లింపులు, టెలిఫోన్ బిల్స్, ఇంటర్నెట్ ఛార్జీలు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుత విధానంలో ఖాతాదారులు తమ బ్యాంకుకు నిర్దిష్ట సూచన చేస్తే సరిపోతుంది. కానీ వచ్చే నెల నుండి రాబోయే కొత్త పద్ధతిలో అదనపు ధృవీకరణ కూడా అవసరం.

ఈ కొత్త నిబంధన గురించి ఇప్పటికే బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. వచ్చే నెల నుండి రికరింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం అదనపు ధృవీకరణ లేకుండా కస్టమర్ల నుండి ఇన్‌స్ట్రక్షన్స్‌ను తీసుకోరు. నిరంతర సేవల కోసం కార్డ్ ద్వారా నేరుగా చెల్లింపులు జరపవచ్చు.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ప్రతి నెల నిర్దిష్ట సూచనలతో జరిగే ఆటో డెబిట్ చెల్లింపులు వచ్చే నెల నుండి అదనపు ధృవీకరణ లేకుండా ప్రాసెస్ చేయరు. ఇది దేశీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్‌కు వర్తిస్తుంది. నమోదు, సవరణ, తొలగింపుకు అదనపు ధృవీకరణ (AFA) అవసరం. డెబిట్‌కు ఇరవై నాలుగు గంటల ముందు ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ ద్వారా ప్రీ-డెబిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్‌లో వచ్చిన లింక్ ద్వారా కస్టమర్ అవసరమనుకుంటే ట్రాన్సాక్షన్‌ను నిలిపివేయవచ్చు. తమ కార్డుకు ఇచ్చిన స్టాండింగ్ సూచనలను వీక్షించడం సవరించడం లేదా రద్దు చేసుకునే సదుపాయం ఉంటుంది. అంతేకాదు, ప్రతిసారి డెబిట్ అయ్యే గరిష్ట మొత్తాన్ని సెట్ చేసుకోవచ్చు. రూ.5వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే రికరింగ్ ట్రాన్సాక్షన్స్‌కు ప్రతిసారి AFA ధృవీకరణ అవసరం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications