తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, కర్ణాటకలో ఇకపై రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేజీలు జరిగినప్పుడు వాటి వివరాలను సబ్-రిజిస్ట్రార్లు తప్పనిసరిగా ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి తెలియజేయాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించినట్లుగా కర్ణాటక స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (SSFT) స్టేట్‌మెంట్‌లను సేకరించడం తప్పనిసరి.

ఎందుకు ఈ మార్పు అంటే : ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 285BA(1) ప్రకారం, SSFT వివరాలను ఐటీ శాఖకు సమర్పించడం అనేది ఇప్పటికే తప్పనిసరి. అయితే చాలా మంది సబ్-రిజిస్ట్రార్లు ఈ స్టేట్‌మెంట్‌లను అందించడంలో విఫలమవుతున్నారని ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకురావడానికి ఈ చర్య తీసుకున్నారు.
ఎలాంటి వివరాలు అందించాలి : రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అండ్ స్టాంపుల కమిషనర్ KA దయానంద జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, సబ్-రిజిస్ట్రార్లు ఆస్తి కొనుగోలుదారులు, అమ్మకందారుల నుండి ఈ కింది వివరాలను సేకరించాలి: పాన్ కార్డ్ వివరాలు, అడ్రస్, రిజిస్ట్రేషన్ తేదీ, లావాదేవీల విలువ మొత్తం, ఆస్తి వివరాలు, డబ్బు చెల్లించే పద్ధతి, ఆధార్ వివరాలు, ఫార్మ్ 60 రిసిప్ట్, పుట్టిన తేదీ, సంప్రదింపు సమాచారం, ఇమెయిల్.
ఈ వివరాలను రెండు పార్టీలు అంటే కొనుగోలుదారులు, అమ్మకందారుల వెరిఫై చేసి సంతకం చేయాలి. SSFT ఫామ్‌ను ఇతర ఆస్తి లావాదేవీల పేపర్లతో పాటు స్కాన్ చేయాలి. ఈ వివరాలు సేకరించే వరకు రిజిస్ట్రేషన్ పేపర్స్ నిలిపివేయాలని సబ్-రిజిస్ట్రార్‌లకు స్పష్టంగా సూచించారు.
పనిభారం తగ్గించడానికి టెక్నాలజీ వినియోగం: కొంతమంది సబ్-రిజిస్ట్రార్లు అధిక పని భారం కారణంగా ఈ వివరాలను అందించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా అధికారులు కావేరి-2.0 ప్రోగ్రామ్‌లో SSFT సబ్మిషన్ చేర్చాలని సిఫార్సు చేశారు. దీని ద్వారా రెండు పార్టీలు అంటే కొనుగోలుదారులు, అమ్మకందారుల వాళ్ళ SSFT వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా అప్‌లోడ్ చేయవచ్చు, దీని ద్వారా పనిభారం కొంత తగ్గుతుంది. ఇంకా డిపార్ట్‌మెంట్ అండ్ ఐటీ అధికారులకు ప్రాసెస్ సులభం చేస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోందంటే : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసినా లేదా అమ్మిన లావాదేవీ విలువ రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే లేదా చట్టంలోని సెక్షన్ 50C కింద స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ ద్వారా ఆస్తి విలువ రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ లావాదేవీని తెలియజేయాలి. 1908 రిజిస్ట్రేషన్ చట్టం కింద నియమించిన ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రార్ లేదా సబ్-రిజిస్ట్రార్‌పై ఈ అధిక-విలువైన ఆస్తి లావాదేవీల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందించే బాధ్యత ఉంటుంది.


Click it and Unblock the Notifications