ప్రధాన జాతీయ రహదారిపై వాహనదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్తగా FASTag వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 3000 రూపాయలతో ఏడాది పాటు ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు 200 ట్రిప్పులు జర్నీ చేయవచ్చు.ప్రతి ట్రిప్పుకు రూ.15 మాత్రమే ఖర్చు అయ్యేలా కొత్త FASTag వార్షిక పాస్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాస్ అన్ని రకాల వాహనాలకు అనుమతించడం జరుగుతుంది. ఆగస్టు 15, 2025 నుండి ఈ FASTag వార్షిక పాస్ అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖా మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ వార్షిక పాస్ ద్వారా వాహనదారులకు డబ్బును మరింత ఆదా చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ పాస్ డబ్బుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని తెలిపారు. కాగా ఈ కొత్త పాస్ గతంలో రూ. 10 వేలుగా ఉంది. ఇప్పుడు మూడు వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పాస్ ద్వారా ప్రతి కారు, జీప్, వ్యాన్ వాహనదారుడు ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులు ఏది ముందు అయితే ఎలాంటా రుసుం లేకుండానే ప్రయాణించవచ్చు.

మీరు వార్షిక పాస్ కొనుగోలు చేసిన తర్వాత, FASTag అర్హత ప్రమాణాలు సరిపోతే.. ఈ పాస్‌ను మీ ప్రస్తుత FASTagలోనే మీరు యాక్టివేట్ చేయవచ్చు. లేదా మీరు యాత్ర మొబైల్ యాప్, NHAI వెబ్‌సైట్ ద్వారా వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది ఆగస్టు 15 నుండి అందుబాటులోకి వస్తుంది.దీంతో మీరు ఒక సంవత్సరం లేదా 200 టోల్ ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.
వాహనం, సంబంధిత ఫాస్టాగ్ అర్హత ప్రమాణాలు చెక్ చేసిన తర్వాత మీ వార్షిక పాస్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వినియోగదారులు హైవే యాత్ర మొబైల్ యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా 2025-26 ఏడాదికి రూ. 3,000 ఈ పాస్ కోసం చెల్లించాలి. చెల్లింపు జరిపిన తర్వాత రిజిస్టర్డ్ ఫాస్టాగ్‌లో మీ వార్షిక పాస్ యాక్టివేట్ చేయబడుతుంది. వార్షిక పాస్ యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం లేదా 200 జర్నీల వరకు చెల్లుబాటు అవుతుంది. మీ 200 ట్రిప్పులు పూర్తయిన తర్వాత లేదా 1 సంవత్సరం తర్వాత దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి.
మీరు ఫాస్టాగ్ యొక్క వార్షిక ట్రిప్ తీసుకుంటే, మీకు 200 ట్రిప్పులు ఉచితంగా లభిస్తాయి. మీరు ప్రతిసారి టోల్ ప్లాజాను దాటినప్పుడల్లా అది ఒక ట్రిప్‌గా లెక్కిస్తారు. అంటే మీరు ఎన్నిసార్లు టోల్ గేట్ దాటితే అన్ని సార్లు ట్రిప్ గా పరిగణిస్తారు. ఈ పాస్ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే (కార్లు, జీపులు, వాన్లు) వర్తిస్తుంది. ప్రతి ట్రిప్పు రూ. 50 నుండి కేవలం రూ. 15కి తగ్గిపోతుంది. మీరు ఈ పాస్ తీసుకున్నట్లయితే ఏడాదికి రూ. 7 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఢిల్లీ-చంఢీఘడ్ ప్రయాణంలో నాలుగు టోల్ ప్లాజాలు ఎదురవుతాయి. ఈ టోల్ ప్లాజాలో ఒక ట్రిప్పు రూ. 405 అయితే రాను పోనూ రూ. 810 అవుతుంది. మీరు నెలకు రెండు సార్లు ప్రయాణిస్తే.. రూ. 1,620 × 12 = ₹19,440 ఖర్చు అవుతుంది. ఈ కొత్త పాస్ తీసుకోవడం ద్వారా మీకు రూ. 3 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. దాదాపు రూ.16 వేలు సేవ్ అవుతాయి.
ఇక ఢిల్లీ ముంబై మధ్య చూసుకున్నట్లయితే..మొత్తం ఆరు టోల్ ప్లాజాలు ఎదురవుతాయి. ఒకసారి పోవడానికి రూ. 1900 ఖర్చు అవుతుంది. మళ్లీ తిరిగి రావడానికి రూ.1900.. ఇలా రాను పోను కలుపుకుంటే రూ. 3,800 ఖర్చు అవుతుంది. నెలకు రెండు సార్లు ప్రయాణిస్తే అయ్యే ఖర్చు దాదాపు రూ. 7600. అదే ఈ పాస్ తీసుకుంటే మీకు రూ.3వేలుతో అయిపోతోంది. రూ. 4 వేల 600 సేవ్ అవుతాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications