RBI News: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్వహిస్తుంది. రెగ్యులేటరీ బ్యాంకింగ్ సంస్థల నిర్వహణకు సంబంధించి అవసరమైన రూల్స్, ఆంక్షలను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. ఇష్టమెుచ్చినట్లు లోన్ల విషయంలో ఛార్జీలు, జరిమానాలు అరికట్టాలని నిర్ణయించింది.
తాజాగా లోన్ ఖాతాల్లో విధించే పెనాల్టీలు, వడ్డీ రేట్ల వెల్లడిలో పారదర్శకత ఉండేలా రిజర్వు బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రుణ ఖాతాలపై జరిమానా విధించడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. లోన్ ఖాతాల్లో పెనాల్టీ ఛార్జీలకు సంబంధించిన మార్గదర్శకాలు జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. కొత్త రూల్స్ కమర్షియల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు, NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, Exim Bank, NABARD, NHB, SIDBI, NABFID వంటి ఆల్-ఇండియా ఆర్థిక సంస్థలతో సహా RBIచే నియంత్రించబడే అన్ని బ్యాంకింగ్ సంస్థలకు వర్తిస్తాయి.అయితే ఇవి క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య క్రెడిట్‌లకు వర్తించవు.

వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేయబడిన రుణాల విషయంలో పెనాల్టీ, మెటీరియల్ నిబంధనలు, షరతులకు అనుగుణంగా లేని వ్యక్తిగత రుణగ్రహీతలకు వర్తించే జరిమానా ఛార్జీలను మించకూడదని వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, జరిమానా ఛార్జీల క్యాపిటలైజేషన్ ఉండకూడదు. అంటే అటువంటి ఛార్జీలపై తదుపరి వడ్డీ లెక్కించబడదు. ఇది రుణ ఖాతాలో వడ్డీ సమ్మేళనం కోసం సాధారణ విధానాలను ప్రభావితం చేయదని RBI స్పష్టం చేసింది.
రుణం పొందిన కస్టమర్ నిబంధనలు పాటించటంలో విఫలమైనప్పుడు లేదా పాటించనప్పుడు బ్యాంకులు వర్తించే వడ్డీ రేట్లను ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్యాంకులు ఉపయోగించకూడదని తాజాగా ఆగస్టు 18, 2023న ప్రకటిస్తూ రుణ ఖాతాలపై జరిమానాలు విధించే బ్యాంకులకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఇందుకోసం బ్యాంకులు తమ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన సవరణలను చేపట్టాలని, ఇప్పటికే తీసుకున్న రుణాలకు సైతం నిర్థేశించిన గడువు లోపు కొత్త జరిమానా ఛార్జీల పాలనకు మారాలని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications