Adani-Hindenburg Case: గౌతమ్ అదానీకి కోర్టులో కొత్త చిక్కులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యవహారంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అత్యున్నత న్యాయస్థానం నుంచి వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గతవారం పిటిషన్ దాఖలైంది.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు గుప్పించింది. దీనిలో అసలు వాస్తవాలను కనుగొనేందుకు, విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటైన పర్యవేక్షణ కమిటీ కూడా ప్రయోజనాల వైరుధ్యాన్ని కలిగి ఉందని సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది.

అందుకే దర్యాప్తుకు ఫైనాన్స్, లా, స్టాక్ మార్కెట్ రంగాలకు చెందిన సభ్యులతో కూడిన కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ప్రయోజనాల విషయంలో విభేదాలు లేని వ్యక్తులను కమిటీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ OP భట్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్‌కో ఛైర్మన్‌గా పనిచేస్తున్నారని పిటిషనర్ ఎత్తి చూపారు. ఈ సంస్థ మార్చి 2022 నుంచి అదానీ కంపెనీలకు ఎనర్జీ భాగస్వామిగా ఉందని పిటిషనర్ వివరించారు.
మరోవైపు కమిటీ సభ్యుడిగా ఉన్న కేవీ కామత్ ఇప్పటికే బ్యాంకు మోసం కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఎదుర్కొంటున్నారు. అదానీ తరపున న్యాయవాది సోమశేఖర్ వివిధ ఫోరమ్‌లలో హాజరయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెబీ ముఖ్యమైన వాస్తవాలను అణచివేసి, DRI హెచ్చరికలతో నిద్రపోటమే కాకుండా.. సెబీ అదానీ విచారణను నిర్వహించడంలో ఆసక్తికి సంబంధించిన స్పష్టమైన వైరుధ్యం కూడా ఉందని తాజా పిటిషన్ కోర్టుకు తెలిపింది. అయితే దీనిపై ధర్మాసనం అక్టోబర్ 13న విచారణం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెుత్తానికి ఇది అదానీ గ్రూప్ కంపెనీలకు, గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications