ఏప్రిల్ 1 నుండి కొత్త పెన్షన్ స్కిం.. ఉద్యోగులు ఎలా అప్లయ్ చేసుకోవాలంటే ?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీతో కూడిన పెన్షన్ అందించే యూనిఫైడ్ పెన్షన్ స్కిం (యుపిఎస్) ఏప్రిల్ 1 నుండి ప్రారంభించబడుతుంది. అయితే ఇప్పటికే ఉన్న ఇంకా కొత్తగా నియమించిన ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) గురువారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఉద్యోగుల కోసం పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. అయితే UPSని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు క్లెయిమ్ ఫామ్ నింపాలి. దీని ద్వారా 23 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPS లేదా NPSలో ఏదైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

new pension scheme will start from April 1 Employees can choose and apply like this by online

జాతీయ పెన్షన్ పథకం (NPS) 1 జనవరి 2004న అమలు చేసారు, కానీ పాత పెన్షన్ పథకం తరహాలో NPSలో ఫిక్స్డ్ పెన్షన్ పొందకపోవడంతో ఉద్యోగులలో ఆగ్రహం నెలకొంది. OPS కింద ఉద్యోగి చివరి ప్రాథమిక వేతనంలో 50 శాతం పెన్షన్‌గా పొందేవారు. పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ దృష్ట్యా కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టు 24న యుపిఎస్ ప్రతిపాదనను ఆమోదించింది.

ఇందులో ఎలా చేరవచ్చంటే ?
1. ప్రస్తుత ఉద్యోగులు: 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ప్రస్తుత ఉద్యోగులు NPSని తీసుకున్న వారు UPSని సెలెక్ట్ చేసుకోవచ్చు . ఇందుకు ఫారం A2ని నింపాలి.
2. కొత్తగా నియమించిన ఉద్యోగులు: 1 ఏప్రిల్ 2025న లేదా ఆ తర్వాత సర్వీసులో చేరిన కొత్త ఉద్యోగులు కూడా ఈ అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు వీరు ఫార్మ్ A1 నింపాలి.
3. రిటైర్మెంట్ చేసిన సిబ్బంది: రిటైర్మెంట్ చేసి NPSతో అనుబంధం ఉన్న ఉద్యోగులు కూడా UPSలో చేరవచ్చు. వీరు KYC డాకుమెంట్స్'తో పాటు ఫారం B2ని సబ్మిట్ చేయాలి.
4. ఉద్యోగి మరణించిన సందర్భంలో: ఉద్యోగి మరణించిన సందర్భంలో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి KYC పేపర్స్ తో పాటు ఫారమ్ B6ని సబ్మిట్ చేయాలి.
5. VRS కేసులు: స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునేటప్పుడు 25 సంవత్సరాల సర్వీస్ నిబంధన వర్తిస్తుంది. అంటే ఇలాంటి ఉద్యోగులు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
6. ఎలా దరఖాస్తు చేయాలి: అన్ని వర్గాలకు రిజిస్టర్ అండ్ క్లెయిమ్ ఫామ్‌లు CRA వెబ్‌సైట్‌లో (https://npscra.nsdl.co.in) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు ఫామ్‌ను భౌతికంగా సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
7. ఈ ఉద్యోగులు చేర్చబడరు: నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యోగి తొలగింపు లేదా సర్వీసు రద్దు లేదా రాజీనామా విషయంలో UPS లేదా అష్యూర్డ్ పే ఆప్షన్ ఉండదు.
8. మార్పులు చేసుకోలేరు: NPS కింద ఉద్యోగులు UPSని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేయబడింది. లేదా UPS లేకుండా NPSతో కొనసాగించవచ్చు. ఒకసారి అప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిని మార్చలేరు.

UPS కీలక నిబంధనలు
1. UPS ద్వారా పెన్షన్ పొందడానికి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉండటం అవసరం.
2. NPS తరహాలో ఇక్కడ కూడా ఉద్యోగులు ప్రాథమిక జీతంలో 10 శాతం సహకారం అందించాలి.
3. ప్రభుత్వం 18.5 శాతం వాటా ఇస్తుంది. అంటే ఈ పథకంలో ఉద్యోగులు ఇంకా ప్రభుత్వం మొత్తం సహకారం 28.5 శాతం ఉంటుంది.
4. ఈ పథకం కింద నెలకు రూ. 10,000 కనీస హామీ పెన్షన్ ఇవ్వబడుతుంది.
5. ఉద్యోగి 25 సంవత్సరాలు సేవలందించినట్లయితే అతని చివరి సంవత్సరంలో మొదటి 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వబడుతుంది.
6. సర్వీస్ కాలం 10 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటే అప్పుడు పెన్షన్ మొత్తాన్ని కేటాయింపు ఆధారంగా నిర్ణయించబడుతుంది.
7. ఉద్యోగి సర్వీస్లో మరణిస్తే ఆ మొత్తంలో 60 శాతం కుటుంబానికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+