A Oneindia Venture

Mutual Fund rules: మ్యూచువల్ ఫండ్స్‌కి కొత్త రూల్.. ఇకపై ఇన్వెస్టర్లు అలా చేయడం కుదరదు

Mutual Fund rules: దీర్ఘకాలంలో మంచి రాబడి సాధించడానికి మ్యూచువల్ ఫండ్స్ అనువైన మార్గంగా కనిపిస్తున్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ, కాంపౌండింగ్ బెనిఫిట్ పొందేందుకు SIP బెస్ట్ వే గా నిలుస్తోంది. అయితే అక్టోబర్ నుంచి ఇందుకు సంబంధించిన ఓ రూల్ మారింది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌(SIP) ల ద్వారా పెట్టుబడులకు కాలపరిమితి విధించాలని నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) నిర్దేశించింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా ముగింపు తేదీ కలిగి ఉండాలని పేర్కొంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

 New mandate date rule imposed on Mutual fund SIP payments

అంటే సాధారణంగా SIP చేసే సమయంలో ఇప్పటి వరకూ 'until cancelled' అనే ఆప్షన్ డీఫాల్ట్ గా సెలక్ట్ చేసి ఉంటుంది. ఇకపై అలా చేయడం కుదరదు. ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసిన తేదీ నుంచి గరిష్ఠంగా 30 ఏళ్ల వరకు కొనసాగించవచ్చు. తక్కువ వ్యవధి కూడా ఎంచుకోవచ్చు కానీ ఎక్కువ సెలక్ట్ చేసుకునేందుకు అనుమతించరు.

ఇందుకు సంబంధించి ఆగస్టు 18న NACH ఓ సర్క్యులర్ జారీ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అధీనంలోని NACH ద్వారానే తక్కువ విలువ కలిగిన హై వాల్యూమ్ ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు నిర్వహించబడతాయి. ఇన్వెస్టర్ల ఖాతా నుంచి SIP చెల్లింపులను మ్యూచువల్ ఫండ్ హౌస్‌ లు సేకరించడానికి ఇదే పద్ధతిని ఉపయోగిస్తాయి. అయితే ఇప్పటికే రన్నింగ్‌ లో ఉన్న SIPలపై ఈ ప్రభావం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+