AP Liquor: లిక్కర్ ప్రియులకు శుభవార్త.. విజయదశమి సందర్భంగా ఏపీ సర్కార్ గిఫ్ట్..
Liquor News: చాలా కాలంగా ఏపీలోని మందుబాబులు ఎదురుచూస్తున్న మంచిరోజులు దగ్గరపడ్డాయి. ఈ క్రమంలో కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. వీటికి ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి సైతం అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.
అయితే ఇక్కడ లిక్కర్ ప్రియులకు శుభవార్త ఏమిటంటే కొత్త పాలసీ కింద షాపులు అక్టోబర్ 11న ఎక్సైజ్ శాఖ షాపుల కేటాయింపులను పూర్తి చేయనుంది. దీంతో చంద్రబాబు సర్కార్ ప్రకటించిన విధంగా రూ.99కే లిక్కర్ అందుబాటులోకి రానుంది. దీంతో మద్యం ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదయదశమి అంటే అక్టోబర్ 12న కొత్త మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. దీంతో కొత్తగా ఏపీలో 3736 రిటైల్ మద్యం షాపులు తెరచుకోనున్నాయి. అలాగే ఇది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టనుందని తెలుస్తోంది. దీంతో గతంలో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం వ్యాపారం తాజాగా ప్రైవేటు వ్యక్తుల చేతికి తిరిగి వెళ్లిపోనుంది.

గతంలో తెలంగాణలో మాదిరిగానే ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏపీలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న దరఖాస్తులను చూస్తే అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కో షాపుకు అంచనాలను మించి దరఖాస్తులు అందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు మద్యం దుకాణాలు నిర్వహించినవారు రెస్టారెంట్లు నడిపిన సాధారణంగా దరఖాస్తులు చేస్తుంటారు. అయితే దీనికి పూర్తి విభిన్నంగా అనేక వర్గాల ప్రజలు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేస్తున్నారు. అధిక ఆదాయాలను అందుకునే కేటగిరీకి చెందిన కాంట్రాక్టర్లు, వైద్యులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఆడిటర్లు వంటి వారు ప్రస్తుతం దరఖాస్తులు జోరుగా వేస్తున్నారు. ఒకవేళ వారికి అదృష్టంలో వస్తే నేరుగా నిర్వహించపోయినా సబ్ లీజులకు ఇచ్చి మంచి ఆదాయాన్ని అందుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు.
గతంలో మద్యం షాపుల వేలంలో పాల్గొనే వ్యక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము రీఫండ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ తెలంగాణ మాదిరిగా కొత్త లైసెన్సింగ్ పాలసీని తీసుకురావటంతో డబ్బులు ఉన్నోళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్సు పొందాలంటే రూ.55 లక్షల నుంచి 85 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications