AP Liquor: లిక్కర్ కిక్ ఆస్వాధిస్తున్న సీఎం చంద్రబాబు.. పండగ మెుదలైందిగా? కానీ షాక్
AP Liquor News: ఏపీలో మందుబాబులు ఎన్నాళ్లనుంచో కొనసాగుతున్న ఎదురుచూపులకు తెరపడింది. నూతన మద్యం పాలసీ అమలులోకి రావటంతో కొన్ని ఉద్రిక్త పరిస్థితుల తర్వాత కొత్తగా ప్రైవేటు వ్యక్తులు వేలంలో దక్కించుకున్న లిక్కర్ షారులు మందుబాబులకు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో షాపుల యజమానులు వారానికి సరిపడా స్టాక్ ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు.
ప్రస్తుతం కొత్త లిక్కర్ షాపులు ఏపీ వ్యాప్తంగా పెట్టిన ఆర్డర్ల విలువ దాదాపు రూ.400 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ రేటుకు అన్ బ్రాండెడ్ లిక్కర్ తాగిన మందుబాబులు ప్రస్తుతం అన్ని బ్రాండ్ల మందు అందుబాటులోకి రావటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో పక్క చంద్రబాబు సర్కార్ సైతం కొత్త మద్యం పాలసీ ద్వారా ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగంలో లిక్కర్ షాపుల లైసెన్సులు, అమ్మకాల రూపంలో రూ.20,000 కోట్లు ఆదాయంగా పొందనుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3396 షాపుల వేలం కోసం దరఖాస్తుల రుసుము రూపంలో రూ.1,800 కోట్లను వసూలు చేసిందని వెల్లడైంది. గత ఏడాది లిక్కర్ అమ్మకాలతో రూ.30 వేల కోట్లు వచ్చాయి.

ఇదే క్రమంలో ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలపై 2 శాతం డ్రగ్ రీహ్యాబిలిటేషన్ సెస్ విధించాలని నిర్ణయించింది. ఇది మద్యం ప్రియులపై అదనపు భారంగా ఉండగా దీని ద్వారా మరో రూ.100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా రానుందని తెలు్సతోంది. ఇప్పటికే రౌండ్ ఆఫ్ చార్జీల రూల్స్ కొంత విమర్శలను అందుకుంటున్న సమయంలో సెస్ గురించి ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే షారులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరచి ఉంచేందుకు వీలు కల్పించింది. ఇదే క్రమంలో డిజిటల్ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావటంపై ఉండి ఎంఎల్ఏ రఘురామ కృష్ణ రాజు సైతం హర్షం వ్యక్తం చేశారు.
మద్యం రేట్లివే..
రాయల్ ఛాలెంజర్స్ విస్కీ క్వార్టర్ రూ.230, 8PM విస్కీ క్వార్టర్ రూ.230, మెక్ డొవెల్స్ విస్కీ క్వార్టర్ రేటు రూ.180, ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ క్వార్టర్ రూ.150గా ఉన్నాయి. ఇదే క్రమంలో మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రూ.240, ఓల్డ్ మాంక్ రమ్ క్వార్ట్ రూ.230, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ రూ.200 ఇలా చెప్పుకుంటూ పోతో కొత్త మద్యం అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం షాపులు దక్కించుకున్న వారికి వారం రోజుల కోసం తాత్కాలిక లైసెన్సులు జారీ చేయబడ్డాయి. దీని తర్వాత పూర్తి స్థాయి రెండేళ్ల కాలానికి సంబంధించిన కొత్త లైసెన్సులను వ్యాపారులు అందుకోనున్నారు. 5 ఏళ్ల తర్వాత మంచి లిక్కర్ అందుబాటులోకి వస్తున్నందున ఏపీలో మందుబాబులో సంతోషంలో ఉన్నప్పటికీ సెజ్, రౌండాఫ్ వంచి చర్యలు భారాన్ని మోపుతున్నాయని చాలా మంది అంటున్నారు.
ఇదే క్రమంలో ఏపీలో ప్రైవేటు వ్యక్తుకు లిక్కర్ షాపుల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే షాపులను దక్కించుకునే విషయంలో స్థానిక అధికార పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు వచ్చిన వేళ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో షాపులు దక్కించుకున్న వ్యక్తులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేదేలేదని బాబు హెచ్చరించారు. దాదాపు 70 మంది ఎమ్మల్యేలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినట్లు ప్రస్తుతం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications