మీరు కొత్తగా ఏదైనా చిన్న లేదా మధ్య తరహా బిజినెస్ ఐడియాస్ (business ideas) తో మార్కెట్‌లోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్నారా? లేదా ఇప్పటికే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (MSME) నడుపుతున్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త లేబర్ కోడ్స్ (New Labour Codes) గురించి తప్పక తెలుసుకోవాలి. ఇది మీ ఇన్వెస్ట్ మెంట్ ఖర్చుని పెంచొచ్చు. ఎలాగంటే..

కొత్త లేబర్ కోడ్స్.. లాభమా? భారమా?
కొత్త లేబర్ కోడ్స్ నిబంధనలు అందరికీ మేలు చేస్తాయి. కానీ, అన్ని రకాల ఉద్యోగులను కనీస వేతనం (Minimum Wage) పరిధిలోకి తీసుకువస్తాయి. దీనివల్ల ముఖ్యంగా MSMEలకు ఖర్చు పెరుగుతుంది. అంతేకాకుండా, గ్రాట్యుటీ (Gratuity) నిబంధనల అమలు ఖర్చు కూడా పెరుగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- మీ బిజినెస్ కోసం నియమించుకున్న ఉద్యోగులకు కనీస వేతనం, ఆరోగ్య బీమా కవరేజ్, క్యాంటీన్లు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
- మీరు మీ ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్(Wage Structure)ని కొత్తగా అమలుచేసిన నిబంధనలకు అనుకూలంగా మార్చాలి.
- ఈ మార్పుల వల్ల కొత్తగా స్టార్ట్ చేసిన చిన్న వ్యాపారాలకు ప్రారంభంలో ఆర్థిక భారం కాస్త పెరుగొచ్చు.
ఈ సవాళ్లు కూడా ఉన్నాయి
చాలా చిన్న వ్యాపారాలకు ప్రత్యేకంగా హెచ్‌ఆర్ నిపుణులు ఉండరు. దీనివల్ల లేబర్ కోడ్‌లను అర్థం చేసుకోవడం, పాలసీలను అప్‌డేట్ చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. అంటే పని గంటల నిబంధనలు, భద్రతా ప్రక్రియలు, పేరోల్ భాగాలను సర్దుబాటు చేయడం వంటివి ఉద్యోగుల మధ్య కూడా స్వల్పకాలిక అనిశ్చితిని సృష్టించవచ్చు.
అదనపు ఖర్చులు
- MSME కార్మికులు ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కోడ్ (Social Security Code) కిందకు వస్తారు. కాబట్టి వాళ్ల రూల్స్ ను పక్కాగా అమలు చేయాలి.
- ఇది ఉద్యోగుల రక్షణను పెంచుతుంది. అలాగే వ్యాపారులకు జీతం ఖర్చులను కూడా పెంచవచ్చు.
- నిబంధనల పాటించడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలంటే, MSMEలు క్లౌడ్ ఆధారిత HR వ్యవస్థలను ఉపయోగించాల్సి రావచ్చు. ఇది మరో అదనపు పెట్టుబడి.
చట్టపరమైన చిక్కులు
ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు (Gig Workers), ప్రమాదకర పరిశ్రమలలోని ఉద్యోగులకు ESIC/EPF, బీమా కవరేజీల వంటివి ఉంటాయి. కాబట్టి MSME వ్యాపారాలు చేసేవాళ్లు కాంట్రిబ్యూషన్ నిబంధనలను అర్థం చేసుకోవడం మరింత అవసరం. లేకపోతే చట్టపరంగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. అంటే చట్టపరమైన పరిణామాలను నివారించడానికి సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పెద్ద చిక్కు ఇదే..
MSMEలకు అత్యంత సవాలుగా మారే అంశం ఉల్లంఘనలను నమోదు చేసే విధానంలో మార్పు. గతంలో దీనిని కేవలం ప్రభుత్వ అధికారి ద్వారా మాత్రమే చేసేవారు. ఇప్పుడు "ఎవరైనా ఉద్యోగిపై ఉల్లంఘన కేసును నమోదు చేయవచ్చు." ఇది కొత్త బిజినెస్ మొదలుపెట్టే వారికి వేధింపులు, కోర్టు కేసులను పెంచే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా.. కొత్తగా బిజినెస్ చేసేవాళ్లు ఈ మార్పులను అర్థం చేసుకుని, పారదర్శకమైన హెచ్‌ఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే కొత్త లేబర్ కోడ్స్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారాలను కొనసాగించొచ్చు.


Click it and Unblock the Notifications