For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఉచిత మెడికల్ చెకప్, వారానికి 4 రోజుల వర్కింగ్ డేస్ వంటి అంశాలు ఉన్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ నాలుగు లేబర్ కోడ్స్ నిబంధనలను త్వరలో ఖరారు చేసే ప్రక్రియను త్వరలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత లేబర్ కోడ్స్‌తో సంస్థలు వారానికి నాలుగు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ, పని గంటలు 48 గంటలుగానే ఉండనుందని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ అపూర్వ చంద్ర తెలిపారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ త్వరలో లేబర్ కోడ్స్ నిబంధనలను త్వరలో ఖరారు చేయవచ్చునని చెబుతున్నారు.

రాష్ట్రాలతో సంప్రదింపులు

రాష్ట్రాలతో సంప్రదింపులు

లేబర్ కోడ్స్‌‌కు సంబంధించి రాష్ట్రాలతో ఏకకాలంలో సంప్రదింపులు జరిగాయి. యూపీ, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వారంలో స్టేట్ లెవల్ లేబర్ కోడ్ డ్రాఫ్టును రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ద్వారా కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలను అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చంద్ర తెలిపారు.

వర్కింగ్ డేస్ తగ్గినా.. గంటలు అంతే

వర్కింగ్ డేస్ తగ్గినా.. గంటలు అంతే

'కొత్త లేబర్ కోడ్ డ్రాఫ్ట్ ప్రకారం వర్కింగ్ డేస్ అయిదు రోజుల కంటే తక్కువకు రావచ్చు. ఇది నాలుగు అయితే మూడు పెయిడ్ హాలీడేస్ ఇవ్వాలి. కనుక ఇది ఏడు రోజుల వారంలో దీనిని 4 లేదా 5 లేదా 6 పని దినాలుగా విభజించాల 'అని చంద్ర అన్నారు. అయితే 48 హవర్స్ వారపు పని గంటల పరిమితి అలాగే ఉంటుందన్నారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు, వలస కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికుల నమోదు, ఇతర సౌకర్యాల కోసం జూన్ 2021 నాటికి వెబ్ పోర్టల్‌ను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్తోంది.

8 గంటలు.. 48 గంటలు

8 గంటలు.. 48 గంటలు

రోజుకు పన్నెండు గంటల పనితో పాటు, మూడు రోజులు వేతనంతో కూడిన సెలవుల అంశాన్ని కార్మిక సంఘాల వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని దానిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. కంపెనీలలో సాధారణంగా వారానికి గరిష్టంగా 48 గంటల పనివేళలు ఉంటాయి. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే వారానికి ఆరు పని రోజులుగా ఉంటాయని, అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులతో రోజుకు 12 గంటల పనిని చేయించుకుంటే వారానికి నాలుగు పనిదినాలు, మిగతామూడు రోజులు సెలవు రోజులుగా ఉంటాయని చెబుతున్నారు.

English summary

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్! | New Labour Codes May Allow 4 day Work Week But With Longer Hours

Employees will have an option to work for four days a week in the country soon. The labour ministry has decided to allow companies to offer flexibility by incorporating changes in the labour codes. The government has clarified that companies may have the option to choose for a four-day week but employees will have to adjust to longer shifts.
Story first published: Tuesday, February 9, 2021, 20:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X