భారత ప్రభుత్వం కొత్త లేబర్ చట్టం(new labour code)ను తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంతో దేశంలోని ఉద్యోగులకు వేతనం, సెలవులు, పనివేళలు, భద్రత వంటి అంశాలపై కొత్త సంస్కరణలు అమలు కానున్నాయి. అయితే ఈ కోడ్ అమలులోకి వచ్చాక ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? ఇంతకీ చట్టంలో ఏముంది? ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త లేబర్ కోడ్స్ లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ రూల్స్ ఫుల్ టైం ఉద్యోగుల నుంచి, కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకూ.. మీడియా, ప్లాంటేషన్స్, ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ వర్తిస్తాయి. అయితే ఈ రూల్స్ ప్రకారం ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
టేక్-హోమ్ శాలరీపై ఎఫెక్ట్
కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగుల మొత్తం CTC లో కనీసం 50% మొత్తం బేసిక్ శాలరీ రూపంలో ఉండటం తప్పనిసరి. ఈ మార్పు కారణంగా చాలా మంది ఉద్యోగుల శాలరీ ప్యాకేజీలు మారే అవకాశం ఉంది. ఇకపై ఉద్యోగుల బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ (DA), రిటైనింగ్ అలవెన్స్.. అన్నీ కలిపి మొత్తం రెమ్యూనరేషన్‌లో 50% ఉండాలి. కంపెనీలు బేసిక్ శాలరీని తక్కువగా చూపించి, అలవెన్స్‌లను పెంచి PF, గ్రాట్యుటీ బాధ్యతలను తగ్గించుకోకుండా నిరోధించడమే ఈ 50% నియమం ముఖ్య ఉద్దేశం. అయితే బేసిక్ శాలరీ పెరగడం వలన ఉద్యోగి అలాగే కంపెనీ చెల్లించే PF, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి. ఈ మార్పు వలన మీ చేతికి వచ్చే నెలవారీ జీతం తగ్గే అవకాశం ఉంది.
కటింగ్స్ పెరగొచ్చు..!
ఇకపై ఉద్యోగుల PF, గ్రాట్యుటీకి వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఈ అదనపు కాంట్రిబ్యూషన్ మీ ప్రస్తుత CTC నుంచే తీయాల్సి ఉంటుంది కాబట్టి నెట్ టేక్-హోమ్ శాలరీ తగ్గుతుంది. 50% నియమాన్ని పాటించడానికి కంపెనీలు ఇంతకుముందు బేసిక్‌లో లేని కొన్ని అలవెన్స్ భాగాలను వేతనంలోకి మార్చవచ్చు. ఇది నెట్ శాలరీపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇక్కడ ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఈ కొత్త విధానం దీర్ఘకాలంలో రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను, సోషల్ సెక్యూరిటీని పెంచుతుంది
కొత్త కార్మిక చట్టాల ముఖ్యాంశాలు ఇవే..
ఈ కొత్త కార్మిక చట్టాలు (కోడ్స్) కేవలం శాలరీ మార్పులే కాకుండా అనేక ఇతర ముఖ్యమైన మార్పులను కూడా తీసుకొచ్చాయి.
- ఈ రూల్స్ ప్రకారం అసంఘటిత రంగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఫ్లోర్ వేజ్ ను నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్రం కూడా ఈ కనీస వేతనం కంటే తక్కువ నిర్ణయించడానికి వీలులేదు.
- ఉద్యోగ నియామకాలు, వేతనాల్లో లింగ వివక్ష ఉండకూడదు. మహిళలు తమ అనుమతితో రాత్రి షిఫ్టులలో కూడా పనిచేయవచ్చు.
- ఓవర్‌టైమ్ చేసేవాళ్లకు సాధారణ వేతనం కంటే రెండు రెట్లు అధికంగా చెల్లించాలి.
- గిగ్ & ప్లాట్‌ఫారమ్ వర్కర్ల కోసం కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2% విరాళంగా అందించాలి.
- ఇకపై గ్రాట్యుటీ పీరియడ్ ఒక ఏడాది మాత్రమే.
- రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటల పని పరిమితి కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications