కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న కార్మిక చట్టాల(New Labour Code)తో దేశంలో ఉద్యోగ నాణ్యత పెరుగుతుందా? ఇకపై దేశంలోని అన్ని రంగాల ఉద్యోగాల్లో ప్రొడక్టివిటీ పెరగబోతోందా? భారత దేశం ఆర్థికంగా దూసుకుపోతున్న ఈ సమయంలో కొత్త చట్టాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? క్లియర్ కట్ అనాలసిస్ ఇప్పుడు చూద్దాం.
పభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సంస్కరణల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. కేవలం పాత చట్టాలను మార్చడం మాత్రమే కాదు, భారతదేశంలోని ఉద్యోగాలను ఫార్మల్ గా మార్చడం కూడా. ఉద్యోగులకు మంచి జీతాలు అందించాలని, ఉద్యోగాల్లో హై ప్రొడక్టివిటీ తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చట్టాల్లో చేసిన మార్పులను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అందుకే ఈ చట్టాలు దేశంలోని ఉపాధి రంగాన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. సుమారు 29 పాత చట్టాలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వలన వ్యాపార సంస్థలకు నిబంధనలు పాటించడం సులభతరం అవుతుంది. అయితే, ఈ చట్టపరమైన మార్పులు కోట్లాది మంది కార్మికుల జీవితాలను, పని నాణ్యతను నిజంగా ఎలా మెరుగుపరుస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఫార్మలైజేషన్ వైపుగా..
సాధారణంగా మన దేశంలోని ఉద్యోగాలు ఫార్మల్ గా ఉండవు. చాలాచోట్ల అనధికారిక ఉద్యోగాలు ఎక్కువగా కనిపిస్తాయి. అనేక వ్యాపారాలు చట్టపరంగా ఉండే చిక్కులను తప్పించుకునేందుకు అనధికారిక (Informal) పద్ధతిలో కార్మికులను నియమించుకుంటాయి. అయితే ఈ కొత్త కోడ్‌లు ఈ విధానాన్ని మార్చబోతున్నాయి.
- ఈజీ పాలసీలు: పాత లేబర్ నిబంధనలు కాస్త సంక్లిష్టంగా ఉండేవి. అందుకే కంపెనీలు అనధికారిక పద్ధతులను అనుసరించేవి. అయితే కొత్త కోడ్‌లతో.. రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ వంటి పనులు ఈజీగా పూర్తి చేయొచ్చు. కంపెనీలు చట్టాన్ని పాటించడం సులభం అయితే అవి మరింత మంది ఉద్యోగులను చట్టబద్ధమైన పద్ధతిలో నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయి.
- ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్: ఇది డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఈ సౌలభ్యం లేకపోవడం వల్లనే కంపెనీలు ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకుని కాంట్రాక్ట్ లేదా అనధికారిక పద్ధతిలో పని చేయించుకునేవి. ఈ కొత్త వెసులుబాటుతో కంపెనీలు భవిష్యత్తుపై భయపడకుండా ఫార్మల్ పద్ధతిలో ఉపాధిని పెంచుతాయి.
అనేక రాష్ట్రాల్లో ఈ సంస్కరణలను అమలు చేయడం వలన తయారీ రంగంలో ఉద్యోగాలు పెరిగాయని నివేదికలు చెప్తున్నాయి. ఈ మార్పులు చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs)కు కూడా వర్తింపజేస్తే మరింత ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
సోషల్ సెక్యూరిటీ..
ఫార్మల్ జాబ్ అంటే.. కేవలం జీతం ఇవ్వడమే కాదు, వారికి సామాజిక భద్రత (Social Security) కల్పించడం. హై ప్రొడక్టివిటీ గల ఉద్యోగాలు సృష్టించాలంటే.. కార్మికులు తాము సురక్షితంగా ఉన్నారని, తమ భవిష్యత్తుకు భరోసా ఉందని భావించాలి.
- గిగ్ వర్కర్లకు భరోసా: ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే లక్షలాది మంది గిగ్ కార్మికులను ఈ కోడ్‌లు మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి తీసుకొచ్చాయి. ఇది వారి పనికి చట్టబద్ధమైన గౌరవాన్ని ఇచ్చి ఈ రంగంలో నాణ్యతను పెంచుతుంది.
- మినిమం వేజెస్ : దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని చట్టబద్ధం చేసి స్థిరత్వం తీసుకురావడం వలన కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే.. మార్కెట్‌లో డిమాండ్ పెరిగి అది పరోక్షంగా కంపెనీల వృద్ధికి.. తద్వారా మరిన్ని ఉద్యోగాల సృష్టికి తోడ్పడుతుంది.
- కాంట్రాక్ట్ వర్కర్స్: ఇకపోతే.. మన దేశంలో కాంట్రాక్ట్ కార్మికుల (Contract Workers) వాటా చాలా ఎక్కువగా ఉండటం(42%) ఒక సవాలుగా మారింది. వీరికి సోషల్ సెక్యూరిటీ లేకపోతే ఫార్మల్ ఉద్యోగాలు పెరిగినా, ప్రొడక్టివిటీ పెరగడం కష్టమే.
స్కిల్స్ కూడా ముఖ్యమే..
చట్టపరమైన మార్పులు సరైన వాతావరణాన్ని మాత్రమే సృష్టించగలవు. కానీ, హై ప్రొడక్టివిటీ అనేది కార్మికుల స్కిల్స్ అలాగే కంపెనీల్లోని టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో కార్మికుల ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంది. దీన్ని పెంచాలంటే.. మరికొన్ని అంశాలపై ఫోకస్ పెట్టాలి.
- స్కిల్స్‌పై పెట్టుబడి: ప్రభుత్వం కేవలం ఉద్యోగ కల్పన మీదే కాకుండా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై కూడా ఫోకస్ పెట్టాలి. మార్కెట్‌కు అవసరమైన అడ్వాన్స్‌డ్ స్కిల్స్ ను నేర్పించే ఏర్పాట్లు చేయాలి.
- ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు GDPలో గణనీయమైన వాటాను విద్య, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ పై ఖర్చు చేయాలి. మెరుగైన విద్య ఉంటేనే కార్మికులు త్వరగా కొత్త సాంకేతికతను నేర్చుకుని ప్రొడక్టివిటీని పెంచగలరు.
ప్రపంచ స్థాయి ప్రొడక్టివిటీ సాధ్యమే..
ఏదేమైనా ఈ సంస్కరణలు దేశంలో ప్రొడక్టివిటీని పెంచేందుకు వేస్తున్న మొదటి అడుగుగా చూడొచ్చు.. అయితే పూర్తి స్థాయిలో ప్రొడక్టివిటీ పెరగాలంటే దానికి స్కిల్స్ అండ్ ట్రైనింగ్ వంటి అంశాలు కూడా ముఖ్యమే. దీనికోసం ఒకపక్క కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూనే మరోపక్క విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. భారతదేశంలో నైపుణ్యానికి కొదువ లేదు. కావాల్సిందల్లా దానికి కొంత పదును పెట్టడమే. కాబట్టి భారతీయ కార్మికులను ఫార్మల్ లేబర్ గా మార్చిన తర్వాత వారిని స్కిల్డ్ లేబర్ గా మార్చే ప్రయత్నం చేయాలి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఫ్యూచర్ లో భారతీయ కార్మికులు ప్రపంచ స్థాయి ప్రొడక్టివిటీని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications