ChatGPTలో కొత్తగా మైండ్ బ్లోయింగ్ ఫీచర్.. ఇంటర్నెట్‌ను ఏలేందుకు AI రెడీ..

ChatGPT new feature: టెక్ ప్రపంచంలో ChatGPT సృష్టించిన సునామీ అంతాఇంత కాదు. ఈ కిల్లర్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దిగ్గజ కంపెనీలు సైతం అవాక్కయ్యాయి. స్టార్టప్‌ల నుంచి సామాన్యుడి వరకు ఈ సాంకేతికతను వినియోగించుకోవడానికి తహతహలాడుతున్నారు. తాజాగా OpenAI చేసిన ప్రకటన వారికి మరింత బూస్ట్ ఇవ్వనుంది.

పలు విధాలుగా ChatGPTని ఉపయోగించుకోగలిగినప్పటికీ ఓ విషయం మాత్రం యూజర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అది కేవలం సెప్టెంబరు 2021 వరకు అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే విశ్లేషించగలదు. అంటే ఆ తర్వాత జరిగిన ఏ విషయాలు దానికి తెలియవు. నిన్నటికి అంతగా విలువనివ్వని ప్రస్తుతం రాకెట్ యుగంలో.. ChatGPT ఎదుగుదలకు ఇదొక పెద్ద విఘాతంగా మారింది.

https://telugu.oneindia.com/entertainment/is-he-the-elimination-this-week-both-of-them-are-in-the-danger-zone-357727.html

ఈ పరిస్థితుల్లో ChatGPT మేకర్ OpenAI తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై తమ వినియోగదారులు లేటెస్ట్ డేటాను సైతం ChatGPT ద్వారా నెట్‌ లో సెర్చ్ చేయొచ్చని తెలిపింది. దీనితో పాటు చిత్రాలు, వాయిస్ ద్వారా కూడా సంభాషణలు జరపవచ్చని వెల్లడించింది.

"ప్లస్ మరియు ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు బ్రౌజింగ్ కూడా అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్స్‌ కూ ఈ ఫీచర్‌ను విస్తరిస్తాము. GPT-4 కింద సెలెక్టర్‌లో 'బ్రౌజ్ విత్ బింగ్'ను ఎంచుకోవడం ద్వారా ఈ సదుపాయాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో OpenAI పోస్ట్‌ చేసింది.

ChatGPT వాయిస్ సంభాషణా సామర్థ్యం.. ఆపిల్‌ కు చెందిన 'సిరి' వంటి ప్రసిద్ధ AI అసిస్టెంట్ తరహాలో ఉంటుంది. వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి తాజా సమాచారాన్ని యాక్సెస్ చేసే ఫీచర్‌ ను OpenAI గతంలోనే యాడ్‌ చేసి పరీక్షించింది. అయితే పేవాల్స్‌ బైపాస్ చేసేందుకు యూజర్స్‌ ను అనుమతించే అవకాశం ఉండటంతో అప్పట్లో దానిని నిలిపివేసింది. కాగా అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+