జియో నుండి 5 సరికొత్త డేటా ప్లాన్‌లు.. ఇవే
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సరికొత్త డేటా ప్లాన్ ఆఫర్లు ప్రకటించింది. ఈ సరికొత్త ప్లాన్స్ రూ.22 నుండి ప్రారంభమై, రూ.152 వరకు ఉంటాయి. ఈ ప్లాన్స్ అన్నీ కూడా 28 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. కొన్ని ప్లాన్స్ డెయిలీ హైస్పీడ్ క్యాప్ కలిగి ఉంటాయి. కొన్ని ఆఫర్లు డేటా బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇవి ప్రధానంగా జియో ఫోన్ వినియోగదారులకు ఉపయోగపడేలా ఉంటాయి.

5 డేటా ప్యాక్స్ ఇవే
ఈ డేటా ప్లాన్‌లు రూ.22, రూ.52, రూ.72, రూ.102, రూ.152 ధరలలో ఉన్నాయి. మొత్తం 5 డేటా ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
రూ.22 ప్యాక్ - 2GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.52 ప్యాక్ - 6GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.72 ప్యాక్ - ప్రతిరోజు 0.5GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.102 ప్యాక్ - ప్రతిరోజు 1GB డేటా - 28 రోజుల కాలపరిమితి

డెయిలీ లిమిట్ తర్వాత...
ఈ ఆఫర్లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది జియో. డెయిలీ ఎఫ్‌యూపీ అనంతరం ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు పడిపోతుంది. గతవారం రూ.749తో ప్రత్యేక వార్షికప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఈ డేటా ప్యాక్‌లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్యాక్‌ల్లో జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. అయితే కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు లేవు.

కొత్త కస్టమర్ల కోసం..
జియో గతవారం జియో ఫోన్ యూజర్ల కోసం రూ.749 యాన్యువల్ ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే కొత్త కస్టమర్లకు రూ.1999, రూ.1499 ప్లాన్స్ తీసుకు వచ్చింది. కాగా, తాజా 5 డేటా ప్లాన్స్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో న్యూస్ వంటి జియో యాప్స్‌కు యాక్సెస్ కావొచ్చు. రూ,72 ప్లాన్‌లో రోజుకు 6.5 జీబీ చొప్పున 28 రోజులకు 14 జీబీ వస్తుంది. రూ.102 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ చొప్పున 28 రోజులకు 28 జీబీ వస్తుంది.


Click it and Unblock the Notifications