మీరు ఉద్యోగం చేస్తూ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అప్లయ్ చేసేటప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. HRA క్లెయిమ్ చేసేటప్పుడు ఇంటి ఓనర్ PAN నంబర్ అవసరమా అని ? దీనికి సమాధానం, మీ ఏడాది అద్దె రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే అవును అని... కానీ కొన్ని షరతుల కింద మాత్రమే...

HRA మినహాయింపు అంటే ఏమిటి: ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు జీతంతో పాటు HRA పొందుతారు. అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇది ఒక రకమైన రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆదాయపు పన్ను శాఖ HRAపై పన్ను మినహాయింపు ఇస్తుంది, అంటే దీని ద్వారా మీ చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది.
ముఖ్యమైన గమనిక: HRAలో అద్దెపై పన్ను మినహాయింపు ప్రయోజనం పాత పన్ను వ్యవస్థ (Old Tax Regime) కింద మాత్రమే లభిస్తుంది. మీరు కొత్త పన్ను వ్యవస్థ సెలక్ట్ చేసుకుంటే ఈ బెనిఫిట్ మీకు ఉండదు.
ఇంటి ఓనర్ PAN ఎప్పుడు అవసరం: మీరు HRA క్లెయిమ్ చేసేటప్పుడు ఇంటి ఓనర్ PAN నంబర్‌ను ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే..
*మీ అద్దె నెలకు రూ. 8,333 (సంవత్సరానికి రూ. 1 లక్ష) లేదా అంతకంటే తక్కువ ఉంటే: HRA పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయడానికి మీరు ఇంటి ఓనర్ PAN నంబర్ అందించాల్సిన అవసరం లేదు.
*మీ అద్దె నెలకు రూ. 8,333 (సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ ఉంటే: ఈ సందర్భంలో మీరు ఇంటి ఓనర్ PAN నంబర్ తప్పనిసరిగా అందించాలి.
కాబట్టి రెండు ఆదాయపు పన్ను నిబంధనలను గుర్తుంచుకోవాలి:
*మీ అద్దె నెలకు రూ. 8,333 కంటే ఎక్కువగా ఉందా ?
*అలా అయితే నెలకు రూ. 50,000 కంటే ఎక్కువగా ఉందా?
ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే, మీరు ఇంటి ఓనర్ PAN నంబర్‌ను తప్పనిసరిగా అందించాలి.
ఇంటి ఓనర్ PAN నంబర్ ఇవ్వకపోతే ఏం చేయాలి: ఒకవేళ ఇంటి ఓనర్ PAN నంబర్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఇంటి ఓనర్ PAN లేదని పేర్కొంటూ మీరు డిక్లరేషన్ లెటర్‌ను సమర్పించవచ్చు. ఈ డిక్లరేషన్ లెటర్‌లో ఇంటి ఓనర్ పేరు, అడ్రస్ ఇంకా అద్దె వివరాలను కూడా చేర్చాలి. దీనితో పాటు అద్దె రసీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి అద్దె కట్టినట్లు ప్రూఫ్స్ మీ వద్ద సిద్ధంగా ఉంచుకోండి.
HRA క్లెయిమ్ చేయడానికి అవసరమైనవి :
*ఇంటి ఓనర్ పేరు అండ్ అడ్రస్ .
*ఇంటి ఓనర్ PAN (మీ ఏడాది అద్దె 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరి).
*అద్దె కట్టినల్టు రసీదులు.
*అద్దె ఒప్పందం (ఏదైనా ఉంటే).
*అద్దె బ్యాంకు ద్వారా కడితే బ్యాంక్ స్టేట్‌మెంట్.


Click it and Unblock the Notifications