పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించేందుకు ఉద్దేశించిన insurance ombudsman rules 2025ని ఇటీవల విడుదల చేసింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే..

ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ తిరస్కరణలు, చెల్లింపుల్లో లేటు, కంప్లెయింట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. ఫిర్యాదుల పరిష్కార విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి.
ప్రతి కంపెనీలో ఒక స్వతంత్ర అధికారి
ప్రస్తుతం పాలసీదారుల ఫిర్యాదులపై ఇన్సూరెన్స్ కంపెనీలే తమ నిర్ణయాలను సమీక్షించుకునే విధానం ఉంది. ఇది అన్యాయంగా ఉంటోందని గుర్తించిన IRDAI.. ఈ విధానాన్ని మార్చేందుకు నడుం బిగించింది.
కొత్త రూల్స్ ప్రకారం..
- మూడేళ్లుగా పనిచేస్తున్న ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ (రీ-ఇన్సూరెన్స్ మినహా) ఒక 'అంతర్గత ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్'ను నియమించాలి.
- ఆ అధికారికి ఇన్సూరెన్స్ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ అధికారి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదా దాని గ్రూప్ కంపెనీలకు ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగి కాకూడదు.
- ఈ అంబుడ్స్‌మన్ జీతం పూర్తిగా స్థిరంగా (Fixed) ఉంటుంది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు ఉండవు. దీని ఉద్దేశం.. వ్యాపార ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం.
కొత్త అంబుడ్స్‌మన్‌కు ఉన్న అధికారాలు
- పరిధి: రూ.50 లక్షల వరకు విలువైన ఫిర్యాదులను ఈ అధికారి పరిష్కరించగలరు.
- తప్పనిసరి నిర్ణయం: ముఖ్యంగా.. ఈ అంబుడ్స్‌మన్ ఇచ్చే తుది నిర్ణయం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టుబడి ఉంటుంది. ఇది పాత విధానానికి పూర్తి విరుద్ధం. గతంలో అంతర్గత నిర్ణయాలను కంపెనీలు సులభంగా పక్కన పెట్టేవి.
- పరిష్కార విధానం: మొదట మధ్యవర్తిత్వం (Conciliation) ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అది విఫలమైతే.. కేసు మెరిట్ల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.
టైం లిమిట్స్ ఇలా..
ఆలస్యాన్ని అరికట్టడానికి insurance ombudsman rules పటిష్టమైన కాలపరిమితులను ప్రతిపాదించాయి. క్లెయిమ్ తిరస్కరణ లేదా 30 రోజుల్లోగా స్పందన రాకపోతే అంబుడ్స్‌మన్‌కు వెళ్లవచ్చు. అంబుడ్స్‌మన్‌కు చేరిన తర్వాత 15 రోజుల్లోగా పరిష్కరించాలి. నిర్ణయాన్ని 3 రోజుల్లోగా తెలియజేయాలి. తుది ఆదేశాన్ని 7 రోజుల్లోగా తప్పనిసరిగా అమలు చేయాలి.
ఆర్థిక జరిమానా..
క్లెయిమ్ చెల్లింపులో లేట్ జరిగితే.. మొదటిసారి క్లెయిమ్ చేసిన తేదీ నుండి బ్యాంక్ రేటుతో పాటు అదనంగా 2% వడ్డీని పాలసీదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన.. క్లెయిమ్ చెల్లింపులను ఆలస్యం చేసే కంపెనీలపై ఆర్థిక భారాన్ని మోపుతుంది.
పాలసీదారులకు బెనిఫిట్ ఇదే..
ఈ కొత్త insurance ombudsman rules అమలులోకి వస్తే.. పాలసీదారులకు వేగంగా న్యాయం జరుగుతుంది. నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్వతంత్రమైన అధికారి నిర్ణయానికి కంపెనీ కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అయితే ఈ నిబంధనలు ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి. తుది నోటిఫికేషన్ తర్వాతే చట్టంగా మారతాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications