కరోనా ఎఫెక్ట్: శాంసంగ్ సరికొత్త ఐడియా, ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే సూపర్ ఆఫర్

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని వ్యాపారాల మీద దారుణంగా పడింది . కరోనా దెబ్బకు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే నాధుడే లేకుండా పోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అమ్మకాలు జరగలేదు . ఒక్క నిత్యావసరాలు మినహాయించి మిగతా అన్నీ లాక్ డౌన్ తో నో సేల్స్ అని తేల్చేసింది సర్కార్ . ఇక ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా చాలా మంది షో రూమ్స్ కు వెళ్లి కొనుగోలు చేసే ఆసక్తి చూపకపోవచ్చు. అందుకే ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ గ్రేట్ ఆఫర్ అంటూ శాంసంగ్ ఒక కొత్త ఐడియాతో ముందుకు వస్తుంది.

శాంసంగ్ స్టే హోమ్ స్టే సేఫ్టీ లాగ్‌ ఇన్‌టు గ్రేట్‌ ఆఫర్స్‌

శాంసంగ్ స్టే హోమ్ స్టే సేఫ్టీ లాగ్‌ ఇన్‌టు గ్రేట్‌ ఆఫర్స్‌

లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ అయిన టీవీ ,ఫ్రిజ్, వాషింగ్ మిషన్ , ఎయిర్ కండీషనర్ వంటి వస్తువులను కొనుగోలు చేయాలని భావించే వినియోగాదారుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్ శాంసంగ్‌ ఇప్పుడు సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘స్టే హోమ్ స్టే సేఫ్టీ లాగ్‌ ఇన్‌టు గ్రేట్‌ ఆఫర్స్‌' పేరుతో ఆన్ లైన్ ప్రీ బుకింగ్ ఆఫర్స్ ను అందిస్తుంది. ఇక శాంసంగ్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వరా వినియోగదారులు ఇళ్లనుంచి బయటకు రాకుండానే తమకు అవసరమైన వాటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

కేవలం బుకింగ్ మాత్రమే కాదు అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్లాన్ లో ఉంది శాంసంగ్.

ఆన్ లైన్ లో ఈ నెల 8వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి 15% రాయితీ

ఆన్ లైన్ లో ఈ నెల 8వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి 15% రాయితీ

ఇక వీటిని గురించి తెలుసుకోవటానికి చెయ్యాల్సిందల్లా https://www.samsung.com/in/offer/online/ce-sale వెబ్‌సైట్ కు లాగిన్ అయ్యి ఆ వెబ్ సైట్ ద్వారా కావలసిన వస్తువులను వెదకడంతో పాటు బుక్ చేసుకోవటమే . ఈ ఆఫర్‌ను వినియోగించి ఈ నెల 8వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి 15% రాయితీ లభించడంతో పాటు, వడ్డీలేని రుణ సదుపాయం కూడా లభిస్తుందని, 18 నెలల వరకు సులభ వాయిదాలలో చెల్లించవచ్చని శాంసంగ్ తెలిపింది.

శాంసంగ్‌ టెలివిజన్లను కొనుగోలు చేస్తే ప్యానెల్‌పై 1+1 ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ

శాంసంగ్‌ టెలివిజన్లను కొనుగోలు చేస్తే ప్యానెల్‌పై 1+1 ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ

లాక్‌డౌన్ తొలగించిన వెంటనే దగ్గరలోని శాంసంగ్ స్టోర్‌ నుంచి ఈ పరికరాలు డోర్ డెలివరీ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది. టెలివిజన్స్‌, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్‌ మెషీన్లు, స్మార్ట్‌ ఓవెన్స్‌ మొదలైన తమ సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని శాంసంగ్ వెల్లడించింది. ఇక శాంసంగ్‌ టెలివిజన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్యానెల్‌పై 1+1 ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ కూడా లభిస్తుంది , జీ5 ప్రీమియం ప్యాక్‌‌తో 30 రోజుల ట్రయల్‌ ఆఫర్‌ను సైతం పొందవచ్చని శాంసంగ్‌ వెల్లడించింది .

రిఫ్రిజిరేటర్లు , ఏసీలు , వాషింగ్ మెషీన్ ల మీద అదిరిపోయే ఆఫర్లు

రిఫ్రిజిరేటర్లు , ఏసీలు , వాషింగ్ మెషీన్ ల మీద అదిరిపోయే ఆఫర్లు

రిఫ్రిజిరేటర్లు , డిజిటల్‌ ఇన్వర్టర్‌ కంప్రెషర్లపై 10 సంవత్సరాల వారెంటీ లభిస్తుందని చెప్పారు. వాషింగ్‌ మెషీన్ల బుక్ చేసుకుంటే మోటర్‌కు 10-12 సంవత్సరాల వారెంటీ అందిస్తామని శాంసంగ్ వెల్లడించారు. స్మార్ట్‌ ఓవెన్స్‌ బుక్ చేసుకున్న వారికి 10 సంవత్సరాల సెరామిక్‌ ఎనామిల్‌ వారెంటీ లభిస్తుందని, అంతేకాకుండా ఉచిత బోరోసిల్‌ కిట్‌, 5 సంవత్సరాల మ్యాగ్నెట్రాన్‌ వారెంటీ కూడా లభిస్తుందని పేర్కొన్నారు .ఎయిర్‌కండీషనర్లపై ఉచిత ఇన్‌స్టలేషన్‌ ఆఫర్‌తో పాటు కండెన్సర్‌, పీసీబీ కంట్రోలర్లకు 5 సంవత్సరాల వారెంటీ, ఉచిత ఏసీ గ్యాస్‌ రీచార్జ్‌ ఆఫర్ లభిస్తుందని శాంసంగ్ తన ఆఫర్లలో ప్రకటించింది .

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+