త్వరలో మీరు కొత్త నోట్ మళ్ళీ చూడబోతున్నారు. అవాక్కయ్యారా.. ఈసారి మీరు అనుకున్నది ఎం జరట్లేదు లేదు ఎందుకంటే మరోసారి కొత్తగా రూ.100 అలాగే రూ.200 నోట్లను జారీ చేయడం గురించి ఆర్‌బిఐ వెల్లడించింది. ఈ కొత్త రూ.100, రూ.200 నోట్లలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో కూడా ఆర్‌బిఐ మంగళవారం వివరంగా తెలిపింది. ఎందుకంటే గతంలో కూడా రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది, దీనికి అదనంగా పాత రూ.1,000 నోటును కూడా నిలిపివేసింది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని ప్రస్తుత రూ.100, రూ. 200 నోట్లను పోలి ఉంటుంది. అందరి దృష్టిలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన అన్ని రూ. 100 ఇంకా రూ. 200 నోట్లు ఎప్పటిలాగే చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి ఇంకా వాటిని చెలామణి నుండి తొలగించడం లేదా నిషేధం అలాంటివి జరగవు అని స్పష్టంగా వెల్లడించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే శక్తికాంత దాస్ అసలు చివరి పదవికాలానికి ముందే శక్తికాంత దాస్ పదవీకాలం పొడిగించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విష్యయం ఏంటంటే ఆర్‌బిఐ 26వ గవర్నర్‌గా అతను బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ IAS అధికారి. ప్రస్తుతం ఆయన 3 సంవత్సరాల అప్పటి కాలానికి నియమితులయ్యారు.
కొత్త 50 రూపాయల నోట్లు కూడా జారీ: గత కొన్ని నెలలకి ముందు కొత్తగా 50 రూపాయల నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం కూడా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. కానీ ఎప్పటిలాగే కొత్త సిరీస్‌లో మహాత్మా గాంధీ ఫోటో కూడా ఈ నోట్లపై ముద్రించనుంది. ఈ నోటుపై కొత్త భద్రతా లక్షణాలను ఏర్పాటు చేస్తారు, అంటే తద్వారా దానిని నకిలీ చేయడం కష్టమవుతుంది ఇంకా దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చు.
ఆర్‌బిఐ అన్ని నోట్లను ఎందుకు మారుస్తోందంటే: గతంలో ఎప్పుడు లేని విధంగా 500 రూపాయల నోటుపై భద్రతా ఫీచర్స్ పెంచడం ద్వారా దానిని నకిలీ నోట్ల నుండి అసలైన నోట్లను రక్షించారు కానీ ఇప్పుడు ఆర్‌బిఐ చిన్న విలువ అంటే తక్కువ విలువ గల నోట్లను కూడా మారుస్తోంది. ఈ లెక్కన చూస్తే రూ.10 నుండి రూ.50 రూపురేఖలు మారవచ్చు. రిజర్వ్ బ్యాంక్ అంటే పాత నోట్లతో చూస్తే కొత్త రూ.50, 100, 200 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే కాకుండా నకిలీనోట్ల నివారణ వంటి భద్రతా లక్షణాలు కూడా మెరుగుపరచబడతాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ కొత్త ఫోటోల అలాగే కొత్త సిరీస్ అండ్ ఎప్పటిలాగే దేశం స్టాండర్ పరిణామాలు కాపీ చేయడం చాలా కూడా కష్టంగా మారుతాయి. అంటే ఈ నోట్లను నకిలీ చేయడం లేదా ఫేక్ కరెన్సీ సృష్టించడం లేదా హవాలా బిజినెస్ చాలా కష్టం అవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications