బంగారంపై రుణం తీసుకునే సామాన్యులకు గుడ్ న్యూస్...ఇకపై మీరు బంగారంపై రుణం తీసుకుంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువగా రుణం లభిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ కొత్త నియమ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు రూ. 2.5 లక్షల వరకు బంగారు రుణాలపై లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతం నుండి 85 శాతంకి పెంచారు. అంటే ఇప్పుడు మీరు గతంలో కంటే బంగారంపై ఎక్కువ రుణం పొందుతారు.
ఇప్పుడు బంగారంపై రుణానికి క్రెడిట్ అప్రైసల్ అవసరం లేదు..అంటే ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటి పత్రాల యొక్క లోతైన పరిశీలన ఇకపై ఉండదు. అయితే ఈ కొత్త నియమం రూ.2.5 లక్షల వరకు తీసుకునే బంగారు రుణాల పై వర్తిస్తుంది.ఇక LTV (లోన్ టు వాల్యూ)లో మీకు రుణం చాలా ఎక్కువగా లభిస్తుంది, ఉదాహరణకు.. మీ బంగారం విలువ లక్ష రూపాయలు అయితే, గతంలో మీరు రూ. 75,000 వరకు రుణం పొందేవారు. అయితే ఆర్బీఐ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో ఇప్పుడు మీరు రూ. 85 వేల వరకు వరకు రుణం పొందవచ్చు.ఆర్బీఐ సవరించిన ఈ నియమాలు అన్ని వాణిజ్య బ్యాంకులు, NBFCలతో పాటు సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అన్నింటికీ వర్తిస్తాయి.

ఈ నిబంధనల వల్ల చిన్న దుకాణదారులతో పాటుగా రైతులు, పేద గృహిణులకు ప్రయోజనం కలగనుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమయ్యే ఏ సామాన్యుడైనా కొత్త నిబంధనలతో ఎక్కువ రుణం పొందుతారు.పైగా తక్కువ పత్రాలతోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రుణం తీసుకోవడం ఇప్పుడు చాలా సులభతరం అవుతుంది.ఆర్‌బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లో నివసించే నిరుపేదలకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా తక్కువ రుణాలు తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారనుంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
ఈ బంగారం రుణాల కాలపరిమితి ఏడాది వరకు ఉంటుంది. బంగారపై రుణం తీసుకునే వారు సంవత్సరం లోపు వడ్డీతో కలిపి అసలు చెల్లించాలి. రుణం తీసుకోవాలనుకునే వారు 1 కిలో నుంచి 50 గ్రాముల వరకు ఉన్న బంగారంపై రుణం తీసుకోవచ్చు. అయితే రుణపరిమితి ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని నియమాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. ఇక మీరు తాకట్టు పెట్టిన రుణం మీకు తిరిగి రావాలంటే..మీరు తీసుకున్న రుణం మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి.
అలాగే రుణదాతలు తాకట్టు పెట్టిన బంగారం వారికి సంబంధిత బ్యాంకులు అదే రోజున లేదా 7 రోజుల లోపు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చెల్లించే పక్షంలొ ఆలస్యం అయితే, వారు తాకట్టుపెట్టిన వారికి పరిహారంగా రోజుకు రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆడిట్ లేదా రిటర్న్ సమయంలో తాకట్టు పెట్టిన బంగారం పోయినా లేదా దెబ్బతిన్నా యజమానికి పూర్తిగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది సంబంధి బ్యాంకులు..
అలాగే మీ బంగారాన్ని వేలం వేసేముందు మీకు సరైన నోటీసు ఇవ్వాలి. బ్యాంకులు వేలం వేసే ప్రక్రియలో..బంగారం రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90 శాతంగా ఉండాలి. వేలం తర్వాత ఏమైనా మిగిలితే దాన్ని ఏడు రోజుల లోపు బంగారం యజమానికి బ్యాంకులు చెల్లించాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. బంగారంపై రుణం తీసుకునే వారు దానికి సంబంధించిన వివరాలను వారు మాట్లాడే చదవగలిగే భాషలో ఎంచుకోవాలి. అప్పుడే అతనికి వివరాలు అన్నీ తెలుస్తాయి. ఈ నియమాలన్నీ వచ్చే ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. ఈ తేదీకి ముందు జారీ చేయబడిన రుణాలకు పాత నిబంధనలను వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications