టోల్ గేట్ల వద్ద టెన్షన్, రీపీట్ చార్జీల బాధ ఇక ఉండదు..కేంద్రం 2025 ఆగస్టు 15నుంచి FASTag వార్షిక పాస్ ప్రవేశపెడుతోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఎంతో ఊరటనిచ్చే వార్తగా దీన్నిచెప్పుకోవచ్చు. ఈ కొత్త పాస్ వ్యవస్థ ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చును కూడా తగ్గించనుంది.
ఈ వార్షిక పాస్ ధర సంవత్సరానికి రూ. 3,000గా నిర్ణయించబడింది. ఇది ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు వర్తిస్తుంది. పాస్ ఉపయోగించే వాహనదారులకు 200 టోల్-ఫ్రీ ప్రయాణాలు లేదా ఒక సంవత్సరం చెల్లుబాటు కాలం ఏది ముందు పూర్తయితే అది లభిస్తుంది. ఇది కేవలం NHAI నిర్వహించే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు వరకే పరిమితమని కేంద్రం తెలిపింది.

వినియోగదారులు ఈ పాస్‌ను రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. మీరు అందులోకి లాగిన్ అయిన తర్వాత, వాహన నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, FASTag ID వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం అర్హత ధృవీకరణ అనంతరం, పేమెంట్ చేయవలసి ఉంటుంది. దీనిని సాధారణంగా UPI, డెబిట్/క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాల ద్వారా మీరు పూర్తి చేయవచ్చు. పేమెంట్ విజయవంతమైన తర్వాత రెండు గంటలలోపే పాస్ యాక్టివేట్ అవుతుంది.
అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ పాస్ వేరొకరికి బదిలీ చేయలేరు. FASTag అంటించిన వాహనానికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర రహదారులు, మునిసిపల్ ప్లాజాలు వంటి ఇతర మార్గాలలో ఇది ప్రామాణిక టోల్ విధానం ప్రకారమే ఉంటుందని కేంద్రం తెలిపింది. మీ పాస్ గడువు ముగిసిన తర్వాత లేదా 200 ప్రయాణాల పరిమితిని చేరిన తర్వాత.. మీరు తిరిగి అదే విధంగా పేమెంట్ చేసి పాత పద్ధతిని అనుసరించవచ్చు. కొత్త FASTag కొనుగోలు అవసరం లేకుండా మీ ప్రస్తుత ట్యాగ్‌కే అప్గ్రేడ్ చేయబడుతుంది.
ఈ కొత్త పాస్ విధానంతో తరచూ జాతీయ రహదారుల్లో ప్రయాణించే ప్రజలకు నిత్య ప్రయాణ ఖర్చులపై నియంత్రణ ఉండే అవకాశం ఉంది. ఇది డిజిటల్ ఇండియా**, స్మార్ట్ మౌబిలిటీ లక్ష్యాలను చేరుకునే దిశగా మరో అడుగు కానుంది.ఫాస్ట్ ట్యాగ్ టోల్ బూత్‌ల వద్ద నగదు చెల్లింపుల అవసరాన్ని తొలగిస్తుంది. మీ సమయం ఆదా అవుతుంది. దీంతో పాటుగా ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. RFID ట్యాగ్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికించబడి ఉంటుంది. టోల్ బూత్‌ల వద్ద రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా గుర్తించబడుతుంది.
టోల్ బూత్ దాటినప్పుడు, ఫాస్ట్ ట్యాగ్‌కు అనుసంధానించబడిన ఖాతా నుండి స్వయంచాలకంగా ఛార్జీలు తీసివేయబడతాయి. వినియోగదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాను ఆన్‌లైన్‌లో లేదా మొబైల్ యాప్‌ల ద్వారా సులభంగా నిర్వహించవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు, రీఛార్జ్ చేయవచ్చు మరియు లావాదేవీ చరిత్రను వీక్షించవచ్చు. టోల్ చెల్లింపుల కోసం నగదు అవసరం లేదు, ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండకుండా ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications