నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన 500 ఇంకా 2000 రూపాయల నోట్లను అత్యాధునిక భద్రతా లక్షణాలతో ప్రవేశపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపాయి. కానీ ఇప్పుడు నిజమైన 500 రూపాయల నోటుల ఉండే నకిలీ 500 రూపాయల నోటు చెలామణిలోకి వచ్చింనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

నకిలీ కొత్త రూ.500 నోట్లు చెలామణిలో ఉండటంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ప్రజలకు చాలా అత్యవసర హెచ్చరిక జారీ చేసిందని న్యూస్ 18 వార్తలలో నివేదించింది. ఇది మాత్రమే కాకుండా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అత్యవసర హెచ్చరికను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సహా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వంటి ముఖ్యమైన సంస్థలకు కూడా పంపింది.
ఈ నకిలీ నోట్లను అధిక ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ముద్రించడం వలన నిజమైన 500 రూపాయల నోట్లకు ఇంకా నకిలీ 500 రూపాయల నోట్లకు మధ్య తేడా దాదాపుగా గుర్తించలేనంతగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ప్రజలు 500 రూపాయలు తీసుకున్న ప్రతిసారీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబందించి ప్రత్యక్ష చెకింగ్ నిర్వహించినట్లు వార్తాల్లో రాగ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న రూ. 500 నోట్లను ఎక్కడ చూసినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించింది.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న నకిలీ 500 రూపాయల నోట్లు, అధిక నాణ్యత గల కాగితంపై ముద్రించినప్పటికీ చాలా చిన్న చిన్న టైపోగ్రాఫికల్ తప్పులతో ఉంటాయి. నకిలీ నోట్లను గుర్తించడానికి ప్రస్తుతం దీనినే ఉపయోగిస్తున్నారు. ఈ నకిలీ 500 రూపాయల నోటులో టెక్స్ట్ RESERVE BANK OF INDIAలో, RESERVE అనే పదంలో E అక్షరానికి బదులుగా A అక్షరాన్ని తప్పుగా ఉపయోగించారు, దింతో RASERVE BANK OF INDIA అని ముద్రించి కనిపిస్తుంది. ఈ విధంగా మాత్రమే నకిలీ 500 రూపాయల నోటుగా గుర్తించవచ్చు.
ఇది చాలా చిన్న టైపింగ్ తప్పు, కానీ ప్రజల దృష్టిని అంతగా ఆకర్షించదు, కాబట్టి మీరు 500 రూపాయల నోటును ఎప్పుడు, ఎక్కడ తీసుకున్న, చుసిన జాగ్రత్తగా పరిశీలించాలి. నకిలీ కరెన్సీ నోట్లు మన దేశానికే కాదు, ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ప్రమాదకరం. 2016 తర్వాత, Paytm, ZPay అండ్ BHIM UPI భారతీయ మార్కెట్‌ను ఆధిపత్యం చేయడం ప్రారంభించాయి, కానీ నేటికీ నగదు అత్యంత ఎక్కువగా చెల్లింపులు కోసం ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications