దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలు కూడా కఠినతరం అవుతున్నాయి. ప్రయాణం వేగంగా సాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ఫాస్టాగ్ (FASTag) వంటి టెక్నాలజీని తెచ్చింది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. వాహన పత్రాలను తనిఖీ చేయడానికి 'ఈ-డిటెక్షన్' (e-detection) అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతోంది. దీనివల్ల మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా గడువు ముగిసినా లేదా లేకపోయినా మీరు టోల్ ప్లాజా దాటేలోపే మీ పేరు మీద చలాన్ (eChallan) జారీ అవుతుంది.
ఈ-డిటెక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద అత్యాధునిక 'హై-రిజల్యూషన్' కెమెరాలను ఏర్పాటు చేశారు. మీరు టోల్ గేట్ వద్ద నుండి వెళ్తున్నప్పుడు.. ఈ కెమెరాలు మీ వాహనం నంబర్ ప్లేట్ ను స్కాన్ చేస్తాయి. ఆ వెంటనే ఆ నంబర్ ను కేంద్ర ప్రభుత్వ వాహన డేటాబేస్ (Vahan Database) తో సరిపోల్చుతాయి.

ఈ ప్రక్రియ అంతా కేవలం కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందా? పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) గడువు ముగిసిందా? ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందా? వంటి వివరాలన్నీ ఆటోమేటిక్ గా తనిఖీ చేయబడతాయి. ఏదైనా పత్రం సరిగ్గా లేదని సిస్టమ్ గుర్తిస్తే, ఏ అధికారి ప్రమేయం లేకుండానే సాఫ్ట్‌వేర్ నేరుగా చలాన్ జనరేట్ చేస్తుంది.
భారీగా పెరిగిన జరిమానాల వివరాలు
ఈ కొత్త డిజిటల్ వ్యవస్థ వల్ల జరిమానాలు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం..
- ఇన్సూరెన్స్ లేకపోతే: మీ వాహనానికి సరైన బీమా లేదని తెలిస్తే రూ. 2,000 వరకు జరిమానా పడవచ్చు.
- పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC): కాలుష్య నియంత్రణ పత్రం లేకపోతే ఏకంగా రూ. 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది.
- ఫిట్‌నెస్ సర్టిఫికెట్: వాహన ఫిట్‌నెస్ లేకపోతే మొదటిసారి రూ. 5,000, రెండోసారి దొరికితే రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు.
- పర్మిట్: కమర్షియల్ వాహనాలకు చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ప్రయాణానికి ముందే ఏం చేయాలి?
టోల్ ప్లాజాల వద్ద అనవసరపు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. ప్రయాణం మొదలుపెట్టే ముందే మీ వాహన పత్రాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవడం ఉత్తమం. 'పరివాహన్' వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మీ ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్‌నెస్ గడువు తేదీలను సరిచూసుకోండి.
ఒకవేళ పొరపాటున చలాన్ (eChallan) పడితే.. దానిని సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. ఆలస్యం చేసే కొద్దీ పెనాల్టీలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం టోల్ టాక్స్ కడితే సరిపోదు, డిజిటల్ సిస్టమ్ మీ ప్రతి కదలికను గమనిస్తోందని గుర్తుంచుకోవాలి. కాబట్టి పక్కాగా పత్రాలతో ప్రయాణించి, సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications