ఈ రోజుల్లో టీ కప్పు దగ్గర నుండి విమాన టిక్కెట్ల వరకు ప్రతిదానికీ క్రెడిట్ కార్డు (Credit card) వాడటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ వాడకం పెరిగే కొద్దీ పన్ను అధికారులు కూడా తమ నిఘాను పెంచుతున్నారు. ప్రతిపాదిత ఆదాయపు పన్ను నిబంధనలు 2026 (Draft Income Tax Rules 2026) ప్రకారం ఏప్రిల్ 1 నుండి క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై కొన్ని కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మార్పులు మీ ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పాన్ కార్డ్ తప్పనిసరి (Mandatory PAN)
ఇకపై కొత్తగా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 'పాన్' (PAN) కార్డ్ తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం, పాన్ వివరాలు ఇవ్వకుండా బ్యాంకులు ఏ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయవు. క్రెడిట్ కార్డ్ ఖర్చులను పన్ను వ్యవస్థతో అనుసంధానించడానికి , నకిలీ ఖాతాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భారీ లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా
ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు రహిత (Online/Swipe) చెల్లింపులు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. అలాగే రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు (Cash) రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే కూడా ఐటీ శాఖకు సమాచారం వెళ్తుంది. మీ ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకపోతే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డ్ తో ఆదాయపు పన్ను చెల్లింపు
పన్ను చెల్లింపుదారులకు ఇది ఒక శుభవార్త. త్వరలో మీరు మీ ఆదాయపు పన్నును కూడా క్రెడిట్ కార్డు (Credit card) ద్వారా చెల్లించే అవకాశం కలగనుంది. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డులకే పరిమితమైన ఈ సౌకర్యం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మరింత వెసులుబాటును ఇస్తుంది. అయితే, దీనిపై పడే వడ్డీ రేట్లు , ప్రాసెసింగ్ ఫీజులను గమనించుకోవడం ముఖ్యం.
కంపెనీ క్రెడిట్ కార్డుల వినియోగం
ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే క్రెడిట్ కార్డుల విషయంలో కూడా నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఆ కార్డ్ ద్వారా చేసే ఖర్చులను వ్యక్తిగత ప్రయోజనాలుగా (Perquisites) పరిగణించి పన్ను విధించే అవకాశం ఉంది. అయితే, ఆ ఖర్చు కేవలం కంపెనీ పనుల కోసమే అని సరైన ఆధారాలు , సర్టిఫికేషన్ చూపిస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు.
అడ్రస్ ప్రూఫ్ గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకునే వారికి ఇది సులభతరమైన మార్పు. గత మూడు నెలల్లో జారీ చేసిన క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఇకపై చెల్లుబాటు అయ్యే చిరునామా ధృవీకరణ పత్రం (Address Proof) గా అంగీకరిస్తారు. దీనివల్ల డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత సులభం అవుతుంది.
ఈ నిబంధనలు ప్రస్తుతానికి డ్రాఫ్ట్ రూపంలో ఉన్నాయి. ప్రజల అభిప్రాయాల తర్వాత ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిబంధనలకు లోబడి వ్యవహరించడం ఉత్తమం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications